కేసీఆర్‌కు కరోనా పాజిటివ్... స్వల్ప స్థాయిలో లక్షణాలు ఉన్నాయన్న డాక్టర్లు - Newsreel

ఫొటో సోర్స్, TelanganaCMO/FB
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు కోవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయిందని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆయనకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలు ఉన్నాయని, ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించినట్లు ఈ ప్రకటనలో వివరించారు. దాంతో, కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో క్వారెంటైన్లో ఉన్నారు.
వైద్యుల బృందం ముఖ్యమంత్రి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది.

తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్ కేసులు
ఆదివారం ఒక్కరోజే తెలంగాణలో కొత్తగా 4,009 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 14 మంది కోవిడ్‌తో మృతి చెందారు. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా 83 వేల కన్నా ఎక్కువ మందికి కోవిడ్ పరీక్షలు చేశారు.
ఆదివారం జీహెచ్ఎంసీలో అధికంగా 705 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
నిజామాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాలో 300కన్నా ఎక్కువ కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,55,433కు చేరుకుంది.

కరోనావైరస్ ఇన్ఫెక్షన్‌తో ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కరోనా బారిన పడ్డారు. ఆయనను ఎయిమ్స్‌లో చేర్పించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. ఆయన జ్వరంతో కూడా బాధపడుతున్నట్లు సమాచారం.
మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 'మీరు త్వరగా కోలుకోవాలి, ఈ కష్ట కాలంలో దేశానికి మీ వంటి వారి విలువైన మార్గదర్శనం అవసరం' అని రాహుల్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

పోస్ట్ of X ముగిసింది, 2
మన్మోహన్ సింగ్‌కు కరోనా వచ్చినట్లు సమాచారం అందిన వెంటనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. "మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కరోనా సోకినట్లు ఇప్పుడే తెలిసింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను" అని ఆమె అన్నారు.

కోవిడ్ సెకండ్ వేవ్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దు

ఫొటో సోర్స్, PA Media
కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన భారత పర్యటనను రద్దు చేసుకున్నారు.
బోరిస్ జాన్సన్ ఈ ఏడాది జనవరిలోనే భారత్‌ను సందర్శించాల్సి ఉండగా, ఆ సమయంలో బ్రిటన్‌లో లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో వీలుపడలేదు.
ఈ పర్యటనను ఏప్రిల్‌కు వాయిదా వేసుకున్నా...ఇప్పుడు భారత్‌లో పరిస్థితుల కారణంగా ఈ పర్యటన మరోసారి వాయిదా పడింది.
ఈ నెలాఖరులో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో బోరిస్ జాన్సన్ ఆన్‌లైన్‌లో మాట్లాడతారని, ఈ ఏడాది చివరిలో వారిద్దరు సమావేశమవుతారని బ్రిటన్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ పర్యటనతో భారత్, బ్రిటన్‌ల మధ్య వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి అనేక ఒప్పందాలు చేసుకోవాలని బ్రిటీష్ ప్రభుత్వం భావించింది.
అయితే బ్రిటన్ ప్రధాన నిర్ణయంపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
''భారత ప్రధానితో బోరిస్ జాన్సన్ జూమ్‌లో చర్చలు జరపడానికి ఇబ్బంది ఏమిటో అర్ధం కావడం లేదు''అని లేబర్ పార్టీకి చెందిన నేత స్టీవ్ రీడ్ స్కై వ్యాఖ్యానించారు.
రెడ్ లిస్ట్‌లో భారత్
భారతదేశం నుంచి ప్రయాణికులను అనుమతించకుండా నిషేధించామని, ఆ దేశాన్ని ట్రావెల్-బ్యాన్ రెడ్ లిస్టులో పెడుతున్నామని బ్రిటన్ ప్రకటించింది. శుక్రవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్ హాంకాక్ చెప్పారు.
"కోవిడ్‌ను ఎదుర్కోవడంలో మనం సాధించిన అభివృద్ధిని మనం కాపాడుకోవాలి" అని ఆయన అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

కేంద్ర మంత్రి సోదరుడికే ఆసుపత్రి బెడ్ దొరకలేదా.. చివరకు ఏమైంది

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ ఆదివారం ఘాజియాబాద్ జిల్లా మెజిస్ట్రేట్‌ను ట్యాగ్ చేస్తూ ట్విటర్‌లో ఒక పోస్ట్ పెట్టారు.
అందులో "దయచేసి ఇది చూడండి. మాకు మీ సహాయం కావాలి. నా సోదరుడికి కరోనా చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో బెడ్ అవసరం. ఘాజియాబాద్‌లో ఎక్కడా బెడ్ దొరకట్లేదు" అని హిందీలో రాసి ఉంది.
రెప్పపాటులో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కేంద్ర మంత్రి బంధువులకే ఆస్పత్రిలో బెడ్ దొరకట్లేదంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
అయితే, తన ట్వీట్‌పై వీకే సింగ్ వివరణ ఇస్తూ మరో ట్వీట్ చేశారు. తరువాత, వైరల్ అయిన తన పాత ట్వీట్‌ను తొలగించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
"నెటిజన్ల అవగాహన స్థాయి, తొందరపాటు చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. అది ఒక ఫార్వర్డ్ ట్వీట్. అసలు ట్వీట్ హిందీలో ఉంది. దాన్ని నేను ఫార్వర్డ్ చేస్తూ, 'దయచేసి ఈ విజ్ఞప్తిని చూడండి' అని జిల్లా మెజిస్ట్రేట్‌ను ట్యాగ్ చేశాను. జిల్లా మేజిస్ట్రేట్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ పడకలను ఏర్పాటు చేశారు. మీ అభిప్రాయాలను మార్చుకోమని మనవి" అని నెటిజన్లను ఉద్దేశించి రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
కాగా, దీనికి ముందు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు దిలీప్ కుమార్ పాండే, వీకే సింగ్‌కు జవాబిస్తూ.. "రోగి పేరు, చిరునామా తదితర వివరాలను పంచుకోండి. సహాయం చేయడానికి సాధ్యమైనంత మేర ప్రయత్నిస్తాం" అని ట్వీట్ చేశారు.
వీకే సింగ్ తన మొదటి ట్వీట్‌లో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సమాచార సలహాదారు శలభ్ మణి త్రిపాఠిని కూడా ట్యాగ్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
త్రిపాఠి వెంటనే స్పందించి, ఈ అభ్యర్థనను పరిశీలించమని ఘాజియాబాద్ మెజిస్ట్రేట్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
త్రిపాఠి ట్వీట్‌కు జవాబుగా పవన్ శర్మ అనే వ్యక్తి.."శలభ్ భాయ్, 2020 జులై తరువాత ఘాజియాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ ట్వీటర్‌లో కనిపించట్లేదు. ఆయన్ను ట్యాగ్ చేయడం అనవసరం. ఫలితం ఉండదు" అని రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 9
వీకే సింగ్ గతంలో చేసిన ఒక ట్వీట్‌ను పోస్టు చేస్తూ @ZakiAhmed2808 అనే వ్యక్తి.. "100 ఆస్పత్రులు వస్తాయని వాగ్దానం చేసిన మంత్రికి ఒక బెడ్ కూడా దొరకలేదని" రాశారు.
కాగా, వీకే సింగ్ ట్వీట్‌కు వివరణ ఇస్తూ కొందరు ఆయన పక్షాన నిలబడ్డారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 10
"మానవతా దృక్పథంతో వీకే సింగ్ మరొకరి పోస్టును జిల్లా మెజిస్ట్రేట్‌కు ఫార్వర్డ్ చేశారు. అయితే, ఆయన అసలు వ్యక్తిని ట్యాగ్ చేయడం మర్చిపోయారు" అని @RahulRahulk4 అనే వ్యక్తి ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: సెకండ్ వేవ్‌లో పిల్లలు, యువతకు ఎక్కువగా వైరస్ సోకుతోందా?
- బెల్లం: ఆహారమా... ఔషధమా?
- తెలంగాణ: పదో తరగతి పరీక్షలు రద్దు.. ఇంటర్ సెకండియర్ పరీక్షలు వాయిదా
- దీర్ఘకాలిక కోవిడ్: ‘రిపోర్టులన్నీ నార్మల్‌గానే వచ్చాయి. కానీ అడుగేస్తే నరకం కనిపించేది’
- స్పుత్నిక్ V: రష్యా వ్యాక్సీన్‌కు భారత్ అనుమతి.. ఈ టీకా గురించి తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
- కరోనావైరస్ సెకండ్ వేవ్: 'గత ఏడాది లాక్‌డౌన్ వల్ల అడుక్కోవాల్సి వచ్చింది... మళ్లీ విధిస్తారా'
- కరోనా వ్యాక్సీన్ : అన్ని ముస్లిం దేశాలు టీకా తీసుకుంటాయా ? హలాల్, హరామ్ చర్చ ఎందుకు మొదలైంది ? బీబీసీ ఫ్యాక్ట్ చెక్
- కరోనావైరస్: మాస్క్ వేసుకోలేదని ఓ వ్యక్తిని రోడ్డు మీద పడేసి తీవ్రంగా కొట్టిన పోలీసులు... వైరల్ అయిన వీడియో
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్‌లో పరిస్థితి ఏంటి?
- టీకా ఉత్సవ్: విశాఖ జిల్లాలో వ్యాక్సీన్ల కోసం 14వేల మంది వస్తే.. 580 మందికి మాత్రమే ఇచ్చారు.. భారత్‌లో టీకాల కొరతకు కారణమేంటి..
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- కరోనా కాలంలో విడాకులు, బ్రేకప్‌లు ఎందుకు పెరుగుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)