ఉపాసన కొణిదెల: ‘డియరెస్ట్ మోదీజీ, సినీ ప్రముఖుల సమావేశంలో దక్షిణాది కళాకారులకు స్థానం లేదా?’

ఫొటో సోర్స్, UpasanaKonidela/twitter
సినీ రంగ ప్రముఖులతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సమావేశమయ్యారు. మహాత్మా గాంధీ పాటించిన ఆదర్శాలు, విలువలను సినిమాల ద్వారా నేటి యువ తరానికి చేరవేయాలని వారికి విజ్ఞప్తి చేశారు.
అయితే, ఈ సమావేశంలో దక్షణాది సినీ ప్రముఖులకు ప్రాతినిధ్యం లేకపోవడంపై అపోలో ఫౌండేషన్ (సీఎస్ఆర్) వైస్ చైర్ పర్సన్, సినీ నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల ఆవేదన వ్యక్తం చేశారు.
ట్విటర్ వేదికగా ఆమె ఈ విషయంపై తన అసంతృప్తిని తెలియజేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘‘డియరెస్ట్ నరేంద్ర మోదీజీ. దక్షిణ భారతీయులమైన మేము కూడా మిమ్మల్ని ఆరాధిస్తాం. మీరు మా ప్రధానిగా ఉన్నందుకు గర్విస్తాం. కానీ సినీ, సాంస్కృతిక రంగాల ప్రముఖులతో మీ సమావేశం కేవలం హిందీ కళాకారుల వరకే పరిమితమైంది. దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన కళాకారులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు’’ అంటూ ఉపాసన ట్వీట్ చేశారు.
ఎంతో బాధతో తన ఆలోచనలను పంచుకుంటున్నానని, దీన్ని సరైన దృష్టిలోనే స్వీకరిస్తారని ఆశిస్తున్నానని ఆమె వ్యాఖ్యానించారు.
12 వేలకు పైగా మంది ఉపాసన ట్వీట్‌ను లైక్ చేశారు. ఆమెకు మద్దతుగా కొంతమంది ట్వీట్లు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అయితే, తాజా మోదీ సమావేశం ‘బాలీవుడ్’ (హిందీ సినీ పరిశ్రమ) కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమమని ఎన్ఎస్ఎన్ మోహన్ అనే వ్యక్తి స్పందించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
దీనికి ప్రతిస్పందిస్తూ చందు సూర్యతేజ అనే వ్యక్తి మోదీ తీరును తప్పుపట్టారు.
‘‘ఆయన దేశానికి ప్రధాని. బాలీవుడ్ ప్రముఖులనే ఆయన ‘మన సినీ రంగం’ అని వర్ణించారు. బాలీవుడ్ ఒక్కటే సినీ పరిశ్రమ అయితే, ఆయన దృష్టిలో దక్షిణ భారత్‌కున్న అర్థం ఏంటి? మాకు నాలుగు సినీ పరిశ్రమలున్నాయి. ఎంతో మంది కళాకారులున్నారు’’ అని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
హిందీని బలవంతంగా అందరిపై ప్రభుత్వం రుద్దుతోందని ‘వాయిస్ ఆఫ్ సౌత్’ పేరుతో ట్విటర్ ఖాతా నిర్వహిస్తున్న వ్యక్తి విమర్శించారు.
అయితే, ఈ సమయంలోనే తాను రాసిన ఓ కవితకు తమిళ అనువాదాన్ని మోదీ ఆదివారం తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇటీవల తమిళనాడులో పర్యటించినప్పుడు దీన్ని రాశానని ఆయన చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
‘‘మామళ్లపురంలోని అందమైన తీరంలో ఈ కవిత రాశా’’ అని ట్వీట్ చేశారు.
ఈ పర్యటన సమయంలో మోదీ పంచెకట్టులో కనిపించిన సంగతి తెలిసిందే.

ఫొటో సోర్స్, Pmo
సినీ రంగ ప్రముఖులతో మోదీ సమావేశం శనివారం దిల్లీలో జరిగింది.
ఈ కార్యక్రమానికి నటులు షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, కంగనా రనౌత్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, దర్శకులు ఇంతియాజ్ అలీ, అనురాగ్ బసు, నిర్మాతలు బోనీ కపూర్, ఏక్తా కపూర్ సహా చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు.

ఫొటో సోర్స్, Pmo
ప్రజలను స్పందింపజేసేలా సినిమాలు తీయడం అవసరమని, ప్రధానితో ఇలా సంభాషించడం బాగా అనిపించిందని షారుఖ్ ఖాన్ అన్నారు. మోదీ తమకు స్ఫూర్తినిచ్చారని ఆమిర్ ఖాన్ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
సినీ పరిశ్రమకు ముందెప్పుడూ ఇంత గౌరవం దక్కలేదని, కళాకారులను ఒక ప్రభుత్వం, ప్రధాని అర్థం చేసుకోవడం ఇదే మొదటిసారి కావొచ్చని కంగనా రనౌత్ అన్నారు.
‘‘కళాకారుల శక్తి సామర్థ్యాలను ముందెవరూ ఇలా గుర్తించలేదు. సినీ పరిశ్రమ తరఫున ప్రధానికి కృతజ్ఞతలు’’ అని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
‘‘సినిమా వినోదం కోసమే అయినా, దాన్ని ఏ లక్ష్యంతో తీస్తున్నామన్న ప్రశ్న దర్శకుడిని తొలుస్తుంది. ఈ రోజు ఒక లక్ష్యం దొరికింది. ఒక దిశ కనిపించింది. మా లాంటి సృజనాత్మక వ్యక్తులకు ఇది చాలా అవసరం’’ అని అనురాగ్ బసు చెప్పారు.
"గాంధీ, గాంధీ అని మనం అంటుంటాం కానీ, ఆయన చెప్పిన విషయాల దగ్గరికి వెళ్లం. ఆయన గురించి సినిమాలు తీయాలన్న ఆలోచన సినీ పరిశ్రమకు చాలా మంచిది’’ అని దర్శకుడు ఇంతియాజ్ అలీ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- #100WOMEN: పోర్న్‌హబ్‌తో కలిసి పనిచేస్తానని హాలీవుడ్ నటి బెల్లా థోర్న్ ఎందుకన్నారు...
- భారతదేశంలో ఇంటర్నెట్: పట్టణ ప్రాంతాలకు... పల్లెలకు మధ్య ఎందుకంత తేడా...
- భారతదేశంలో ఇంటర్నెట్ను అత్యధికంగా వాడుతున్నదెవరు...
- పాకిస్తాన్‌కు 4 నెలల డెడ్‌లైన్
- ‘80 రూపాయలకే ఇల్లు పథకం’
- 'పప్పు' చేసిన అద్భుతం... అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డఫ్లో జంటకు నోబెల్
- నింజా టెక్నిక్: వ్యాసం రాయమంటే 'ఖాళీ' పేపర్ ఇచ్చిన అమ్మాయికి అత్యధిక మార్కులు.. ఎలా?
- కంట్లో ప్రతిబింబించిన చిత్రంతో పాప్‌సింగర్ ఇల్లు కనిపెట్టి వేధించిన యువకుడు
- టర్కీ అధ్యక్షుడి హెచ్చరిక: 'కుర్దు ఫైటర్లు ఉత్తర సిరియా నుంచి వెనక్కి వెళ్లకపోతే తలలు చిదిమేస్తాం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)