బ్రెగ్జిట్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కొత్త ఒప్పందానికి మద్దతు సాధించగలరా?

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన కొత్త బ్రెగ్జిట్ ఒప్పందంపై కామన్స్‌లో మెజారిటీ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతకుముందు ఆయన ఈ కొత్త ఒప్పందం విషయంలో బ్రిటన్, యూరోపియన్ యూనియన్ల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని ప్రకటిస్తూ ట్వీట్ చేశారు.
ఈ ఒప్పందంపై తాను చాలా నమ్మకంగా ఉన్నానని, ఎంపీలు తన ఒప్పందానికి మద్దతు ఇస్తారని ఆయన గట్టిగా చెబుతున్నారు. అయితే,శనివారం పార్లమెంటులో దీనిపై ఓటింగ్ పోటాపోటీగా ఉండే అవకాశం ఉందని కూడా ఆయన అన్నారు.
డీయూపీ (డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ) తన ప్రణాళికకు వ్యతిరేకంగా ఉండటమే అందుకు కారణమని ఆయన భావిస్తున్నారు.
ఓటింగ్‌ను బహిష్కరించే లేబర్ పార్టీ ఎంపీలు, టోరీ బ్రెక్సైటర్స్ బృందంతో సహా పార్టీ నుంచి తాను బహిష్కరించిన తిరుగుబాటుదారులపై ప్రధాని దృష్టి పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తారని బహిరంగంగా ప్రకటించిన డెమోక్రాటిక్ యూనియన్ పార్టీతో చర్చలు కొనసాగుతాయని కన్జర్వేటివ్ పార్టీ చైర్మన్ జేమ్స్ తెలపారు.
అక్టోబర్ 31నాటికి బ్రెగ్జిట్ గడువు ముగియనుంది. దీనికంటే ముందు ప్రధానమంత్రి తన నూతన ఒప్పందాన్ని ఆమోదించడానికి శనివారం కామన్స్‌లో జరిగే ఓటింగ్ చివరి అవకాశంగా ఉంది.

ఫొటో సోర్స్, Reuters
ఒకవేళ ప్రధాని ప్రణాళికను ఎంపీలు తిరస్కరిస్తే, వారంతా బ్రెగ్జిట్ తుది గడువును 31 జనవరి 2020 వరకు పొడిగించేలా యూరోపియన్ యూనియన్‌ను కోరాలని ప్రధాన మంత్రికి చెబుతారు. అయితే, తాను అలా చేయనని బోరిస్ జాన్సన్ ఇప్పటికే అనేక సార్లు నొక్కి చెప్పారు.
ఒక వేళ శనివారం జరిగే ఓటింగ్‌లో ప్రభుత్వం ఓడిపోతే ఇక ఆలస్యం చేయకుండా సార్వత్రిక ఎన్నికలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుందని బీబీసీ పొలిటికల్ ఎడిటర్ లారా కుయెన్స్‌బర్గ్ అన్నారు.
యూకే, ఈయూలు మధ్య సవరించిన బ్రెగ్జిట్ ఒప్పందాన్ని గురువారం యూరోపియన్ నేతల శిఖరాగ్ర సమావేశంలో ప్రకటించారు.
ఈ ఒప్పందం అద్భుతమైందని ప్రధాని బోరిస్ జాక్సన్ ప్రశంసించారు. తన నూతన ప్రణాళికకు ఓటు వేసి బెగ్జిట్‌ను పూర్తి చేయాలని ఎంపీలను కోరారు.
పార్లమెంట్ ఆమోదం పొందడానికి డీయూపీ మద్దతు అత్యంత కీలకం. కానీ, ఆ పార్టీ ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది.
ప్రతిపక్షాలు కూడా తాము ఒప్పందాన్ని తిరస్కరిస్తున్నామని, ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని తమ సభ్యులకు సూచించినట్లు పేర్కొన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
దీంతో ప్రధాన మంత్రి తన ఒప్పందం అమలుకు మూడు బృందాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది.
- ప్రధాన మంత్రి ఒప్పందానికి ఇంకా మద్దతు ఇవ్వని, మాజీ ప్రధాన మంత్రి థెరిసా మే ఒప్పందానికి అనేకసార్లు వ్యతిరేకంగా ఓటువేసిన టోరీ బ్రెక్సైటర్స్ బృందం.
- ఇప్పుడు స్వతంత్రులుగా ఉన్న 23 మంది టోరీ మాజీ ఎంపీలు. ప్రధాన మంత్రిపై తిరుగుబాటు చేసి బహిష్కరణకు గురైన 21 మంది ఎంపీలు.
- కార్మికుల, పర్యావరణ పరిరక్షణపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఒప్పందానికి మద్దతిచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినలేబర్ ఎంపీల బృందం .
వీరిపై బోరిస్ జాక్సన్ ప్రధానంగా దృష్టిసారించారు.
ఎంపీ రొన్నీ క్యాంప్‌బెల్ బీబీసీ న్యూస్‌నైట్‌తో మాట్లాడుతూ, ఒప్పందానికి మద్దతివ్వాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
''మూడేళ్ల నుంచి పార్లమెంట్ నడుస్తున్న తీరును చూసి దేశం విసిగిపోయిందని అనుకుంటున్నా'' అని చెప్పారు.
లేబర్ పార్టీ నుంచి తిరుగుబాటు చేసి ప్రధానమంత్రికి మద్దతు ఇచ్చిన ఎంపీలు విప్‌ను కోల్పోరని, అంటే పార్టీ నుంచి బహిష్కరణకుగురికారని బీబీసీ పొలిటికల్ కరస్పాండెంట్ నిక్ ఎర్డ్లీ అన్నారు.
ఎంపీలు తన ఒప్పందానికి మద్దతిచ్చే అవకాశం ఉందని బోరీ జాన్సన్ గురువారం విశ్వాసంగా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం: భారత్‌లో పేదరికం తగ్గుతోందా
- సెల్ఫీలతో ఇబ్బంది పెడతారు, నంబర్ అడిగి.. ఫ్రెండ్షిప్ చేస్తావా అంటారు: తేజస్ ఎక్స్‌ప్రెస్ 'ట్రెయిన్ హోస్టెస్'
- ఉత్తర కొరియాలో అత్యంత ఎత్తైన పర్వతాన్ని గుర్రంపై ఎక్కిన కిమ్
- బీబీసీ 100 వుమన్: ఈ జాబితాలో భారతీయులు ఎంత మంది?
- గూగుల్ పిక్సెల్ 4: 'రాడార్ ఫీచర్' కారణంగా భారతదేశంలో విడుదల రద్దు
- మహిళ అంగీకారంతో సెక్స్ చేసినా మగాడి మీద 'రేప్' కేసు పెట్టవచ్చా...
- జయలలిత తమిళనాడులో సమ్మె చేస్తున్న ఉద్యోగులను తొలగించినప్పుడేం జరిగింది?
- రూసీ కరంజియా: భారత మీడియాకు కొత్త నడక నేర్పిన జర్నలిస్ట్
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- సిరియాలో టర్కీ సైనిక చర్యతో ఇస్లామిక్ స్టేట్ తిరిగి పుంజుకుంటుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








