విరాట్ కోహ్లీ: జావెద్ మియాందాద్ 26 ఏళ్ల రికార్డు బ్రేక్

విరాట్ కోహ్లీ జావెద్ మియాందాద్

ఫొటో సోర్స్, Getty Images

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండిస్‌తో ఆదివారం జరిగిన రెండో వన్డేలో సెంచరీ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన విరాట్ 26 ఏళ్ల రికార్డును తిరగరాశాడు.

ఇప్పటి వరకు వెస్టిండీస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పాకిస్థాన్‌ ఆటగాడు జావెద్‌ మియాందాద్‌ పేరిట రికార్డు ఉంది.

మియాందాద్‌ వెస్టిండిస్‌పై 64 ఇన్నింగ్స్‌ల్లో 1,930 పరుగులు చేశాడు. ఇప్పుడు విరాట్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు.

19 పరుగులు చేస్తే మియాందాద్ రికార్డును సమం చేసే క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ కరీబియన్ జట్టుపై విరుచకపడ్డాడు. 125 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 120 పరుగులు చేశాడు.

వన్డేలో కోహ్లీకి ఇది 42వ శతకం. ఈ సెంచరీతో వెస్టండీస్‌పై అతని పరుగులు 2,032కు చేరుకుంది. 35 ఇన్నింగ్స్‌ల్లోనే కోహ్లీ ఈ ఘనత సాధించాడు.

సచిన్ సౌరవ్

ఫొటో సోర్స్, Getty Images

సౌరవ్ రికార్డు బ్రేక్... సచిన్ రికార్డుకు చేరువలో

టీం ఇండియా సారథి ఇదే వన్డేలో మరో రికార్డునూ సాధించాడు.

భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడుగా విరాట్( 11,406) నిలిచాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(11,363)ని అధిగమించాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఇప్పటి వరకు భారత్ తరఫునే కాకుండా ప్రపంచంలో అత్యధిక పరుగులు చేసిన వన్డే ఆటగాడుగా సచిన్( 18,426) మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో కోహ్లీ 8వ స్థానంలో నిలిచాడు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)