కోల్‌కతా: అమిత్ షా ర్యాలీలో ఘర్షణలు.. హింసకు పాల్పడిందెవరు

ఫొటో సోర్స్, ANI
- రచయిత, ఎం. ప్రభాకర్
- హోదా, బీబీసీ కోసం
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మంగళవారం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీ తీవ్ర రసాభాసగా మారింది.
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) విద్యార్థి విభాగం సభ్యులు, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
అమిత్ షా ర్యాలీ జరుగుతున్న సమయంలో టీఎంసీ విద్యార్థి విభాగం సభ్యులు నల్ల జెండాలు ప్రదర్శించారు. ఆయన వాహనంపై రాళ్లు, కర్రలు విసిరారు. 'అమిత్ షా గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు.
దీంతో బీజేపీ కార్యకర్తలు వారితో ఘర్షణకు దిగారు.
కొంతసేపు ఇరు వర్గాలు రాళ్లు, సీసాలను విసురుకున్నాయి. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కొందరికి గాయాలయ్యాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ర్యాలీ జరిగిన ప్రాంతంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడి హింస చెలరేగింది. కొందరు వాహనాలను తగులబెట్టారు.
ఈ ఘటన తర్వాత అమిత్ షా పాత్రికేయులతో మాట్లాడారు.
ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతో టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఉన్నారని, తాజా పరిణామాలే అందుకు నిదర్శనమని అన్నారు.
టీఎంసీ గూండాలు దాడి చేయడంతో రోడ్‌షో పూర్తి చేయలేకపోయామని, వివేకానందుడి ప్రతిమకు పూలమాల వేయలేకపోయామని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
నల్లజెండాలు పట్టకుని వచ్చిన టీఎంసీ విద్యార్థి విభాగం సభ్యులను రక్షణ వలయం చీల్చుకుని ర్యాలీలోకి వచ్చేందుకు పోలీసులే అనుమతించారని బీజేపీ రాష్ర్ట కార్యదర్శి రాహుల్ సిన్హా అన్నారు.
బీజేపీ కార్యకర్తలు కావాలనే హింసకు దిగారని టీఎంసీ ఆరోపించింది.
''తమ బలం చూపించుకోవాలని బీజేపీ కార్యకర్తలే హంగామా చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది'' అని టీఎంసీ ప్రధాన కార్యదర్శి పార్థ చటర్జీ అన్నారు.

ఫొటో సోర్స్, PTI
‘బయటి నుంచి గూండాలను తెచ్చారు’
బయటి నుంచి గూండాలను తెప్పించుకుని బీజేపీ హింసకు దిగిందని మమతా బెనర్జీ ఆరోపించారు. విద్యాసాగర్ కాలేజ్‌లో భాజపా సమర్థకులుగా భావిస్థున్న వ్యక్తులే విధ్వంసం సృష్టించారని అన్నారు.
అమిత్ షా ర్యాలీకి రాకముందే కలకత్తా విశ్వవిద్యాలయం ద్వారం సమీపంలో టీఎంసీ విద్యార్థి విభాగానికి చెందిన వందల మంది నల్లజెండాలతో బైఠాయించారని ఘటనలకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న సోమాన్ సేన్ అని పాత్రికేయుడు చెప్పారు.
''టీఎంసీ విద్యార్థులను పోలీసులు మొదట అడ్డుకున్నారు. రోడ్‌షోకు అమిత్ షా రాగానే, ఆ విద్యార్థులంతా లేచి 'గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. ఒక్కసారిగా షా వాహనంపైకి రాళ్లు, కర్రలు విసిరారు. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బీజేపీ కార్యకర్తలు కూడా రాళ్లు రువ్వడం మొదలుపెట్టారు. విశ్వవిద్యాలయం వైపు సీసాలు విసిరారు. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి'' అని వివరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఈ ర్యాలీ విషయంపై మంగళవారం ఉదయం నుంచే టీఎంసీ, బీజేపీ పరస్పరం విమర్శలు చేసుకుంటూ వచ్చాయి.
రోడ్‌షో మొదలవ్వడానికి రెండు గంటల ముందే అది వెళ్లే లెనిన్ సరణీ మార్గంలో ఉన్న బీజేపీ బ్యానర్లు, జెండాలు, కటౌట్లను పోలీసులు తొలగించారు.
పోలీసుల పేరుతో టీఎంసీ కార్యకర్తలే ఈ పనిచేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ్ ధర్మతల్లా ప్రాంతంలో కొద్దిసేపు ధర్నాకు దిగారు. అమిత్ షా రోడ్‌షోకు అవరోధాలు కల్పించాలని టీఎంసీ ప్రయత్నిస్తోందని అన్నారు.

ఫొటో సోర్స్, SANJAY DAS
ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం బ్యానర్లు, జెండాలు, కటౌట్లు తొలగించామని పోలీసులు వివరణ ఇచ్చారు.
మంగళవారం ర్యాలీ గురించి ఇదివరకు అమిత్ షా ప్రసంగిస్తూ మమతా బెనర్జీకి సవాలు విసిరారు.
''మంగళవారం కోల్‌కతాలో జైశ్రీరామ్ అని నినదిస్తా, చేతనైతే మమత నన్ను అరెస్టు చేయించాలి'' అని షా వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై టీఎంసీ నేత డెరెక్ ఓ బ్రయన్ స్పందిస్తూ.. అమిత్ షాకు ఎన్నికల ద్వారా ప్రజలే బదులు చెప్తారని అన్నారు.
ఇవి కూడా చదవండి
- వీర్ సావర్కర్: కొందరికి హీరో, మరికొందరికి విలన్...
- సుబ్బయ్య హోటల్: "34 రకాల పదార్థాలు.. కొసరి కొసరి వడ్డించి, తినే వరకూ వదిలిపెట్టరు"
- అమెరికా: 'ఈ శిలువను బహిరంగ ప్రదేశం నుంచి తొలగించండి'
- భారత్, దక్షిణాసియా అమ్మాయిలపై ఆస్ట్రేలియాలో లైంగిక వేధింపులు
- 'లైంగిక దాడుల బాధితులను ఆదుకోవడంలో విఫలం' అనే కథనంపై స్పందించిన భారత క్యాథలిక్ చర్చి
- ‘‘వాటికన్ ఒక గే సంస్థ’’: క్రైస్తవ పూజారుల ‘రహస్య జీవితాలు బట్టబయలు చేసిన’ జర్నలిస్టు
- బీజేపీకి ఇది స్వర్ణయుగమా?
- ‘బంగ్లాగా పశ్చిమ్ బెంగాల్’: ఒక రాష్ట్రం పేరును ఎలా మార్చుతారంటే..
- మమతా బెనర్జీ మంతనాలు దేని కోసం?
- Fact Check: బీజేపీ ర్యాలీగా వైరల్ అవుతున్న ఈ ఫోటో నిజమేనా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








