అడ్వాణీని అమిత్ షా అందరిముందూ అవమానించారా?- BBC FACT CHECK

ఫొటో సోర్స్, facebook
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ బృందం
- హోదా, బీబీసీ న్యూస్
బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్‌కే అడ్వాణీని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అవమానిస్తున్నట్లుగా చూపుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
"బహిరంగ అవమానం! ఇంతకు మించిన అవమానం మరోటి ఉండదు! పార్టీకి మూలపురుషుడైన అగ్ర నాయకుడిని గెంటివేశారు" అంటూ క్యాప్షన్లు పెట్టి ఆ వీడియోను షేర్ చేస్తున్నారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
ఒక సభా వేదిక మీది నుంచి వెళ్లిపోవాలంటూ అడ్వాణీని అమిత్ షా ఆదేశిస్తున్నట్లుగా ఆ వీడియోలో కనిపిస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న సభా వేదిక నుంచి బీజేపీకి మూలపురుషుడైన అడ్వాణీని "గెంటివేశారు" అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించిన తర్వాత ఈ వీడియో వెలుగులోకి వచ్చింది.
"హిందూయిజంలో గురువే సుప్రీం. మోదీజీకి గురువు ఎవరు? అడ్వాణీజీ. అయితే, శిష్యుడు తన గురువు ముందు చేతులు కట్టుకోవడంలేదు. ఆయన తన గురువును వేదిక నుంచే గెంటివేశారు.
ఆయన ముఖం మీదకు బూటు విసిరి అడ్వాణీని బలవంతంగా వేదిక మీది నుంచి కిందికి పంపించేశారు. ఆయనే ఇప్పుడు హిందూయిజం గురించి మాట్లాడుతున్నారు" అని రాహుల్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అడ్వాణీ 1991 నుంచి (రెండేళ్లు మినహా) గుజరాత్‌లోని గాంధీనగర్ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ, ఈసారి ఆ స్థానం నుంచి బీజేపీ అమిత్ షాను బరిలోకి దించింది.
75 ఏళ్లకు పైబడిన వారికి సీట్లు ఇవ్వకూడదని ఆ పార్టీ నిర్ణయించినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి.
23 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియో క్లిప్‌ను ఫేస్‌బుక్, ట్విటర్‌లో వేలసార్లు షేర్ చేశారు.

ఫొటో సోర్స్, facebook
అయితే, ఆ వీడియో ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని మా పరిశీలనలో తేలింది.
ఆ క్లిప్‌లో వాస్తవంగా ఉన్నదేంటి?
ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఒక పెద్ద వీడియో నుంచి ఈ వైరల్ వీడియో క్లిప్‌ను కత్తిరించారు.
2014 ఆగస్టు 9న దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన బీజేపీ జాతీయ మండలి సమావేశానికి సంబంధించిన పెద్ద వీడియో నుంచి ఆ క్లిప్‌ను కత్తిరించారు.
పూర్తి వీడియో నిడివి గంట నలభై నిమిషాలు ఉంది. అందులో అడ్వాణీ పోడియం వద్దకు వెళ్లి మాట్లాడేందుకు అమిత్ షా ఆయనకు సాయం చేస్తున్నట్లు ఆ వీడియో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 1
వైరల్ వీడియో vs వాస్తవ వీడియో
వైరల్ చేసిన 23 సెకన్ల వీడియో క్లిప్‌లో రెండు భాగాలు ఉన్నాయి.
వీడియోలో పైన ఉన్న చిత్రంలో ప్రధాని మోదీ ఏదో చదువుతుండగా, అమిత్ షా వేదిక నుంచి వెళ్లిపోవాలంటూ అడ్వాణీని ఆదేశిస్తున్నట్లుగా ఉంది.
కింది చిత్రంలో అమిత్ షా, అడ్వాణీ ఇద్దరూ మాట్లాడుకుంటున్నట్లుగా ఉంది. అమిత్ షా సైగలు చేయగానే అడ్వాణీ వేదిక నుంచి వెళ్లిపోతున్నట్లుగా కనిపిస్తుంది.
కానీ, అడ్వాణీ పట్ల అమిత్ షా అగౌరవంగా ప్రవర్తించారన్న వాదించడంలో వాస్తవం లేదు.
వాస్తవ వీడియోలో అడ్వాణీ ప్రసంగించేందుకు మైకును సవరిస్తూ అమిత్ షా ఆయనకు సాయపడుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే, వేదికపై కాస్త వెనుక ఉన్న పోడియం వద్దకు వెళ్లి ప్రసంగించాలని అడ్వాణీ నిర్ణయించారు. దాంతో, ఏ పోడియం వద్దకు వెళ్లాలో అమిత్ షా చేతితో చూపించారు.
ఆ సమావేశానికి సంబంధించిన పూర్తి వీడియో బీజేపీ అధికారిక యూట్యూబ్ పేజీలో ఇప్పటికీ అందుబాటులో ఉంది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 2
ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకూ అమిత్ షా పక్కనే అడ్వాణీ కూర్చుని ఉండటం కూడా ఈ వీడియోలో చూడొచ్చు.
ఇవి కూడా చదవండి:
- మసీదుల్లో పురుషులతో కలిసి మహిళల నమాజ్‌కు అనుమతించాలంటూ పిటిషన్.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
- IPL: విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ ఎందుకు విఫలమవుతోంది
- మోదీ ఈ మహిళల కాళ్లు కడిగారు.. మరి, వారి జీవితాలు ఏమైనా మారాయా
- అభినందన్ బీజేపీకి మద్దతు పలికారా
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
- ‘నల్లగా వంకాయలా ఉన్నావు.. నీకు మొగుడిని ఎలా తేవాలి అని వెక్కిరించారు’
- చదువుకునే రోజుల్లోనే 2 శతకాలు.. సమాజం వెలివేసినా 40 వితంతు వివాహాలు
- అత్యంత భారీ ఎయిర్పోర్ట్.. అంతా ఒక్క బిల్డింగ్‌లోనే
- సముద్రంలోని ఇంట్లో కాపురం చేస్తున్న ప్రేమజంటకు మరణ శిక్ష పడనుందా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









