వీకే సింగ్: 'భారత సైన్యాన్ని మోదీ సేన అనేవారు దేశద్రోహులే’

వీకే సింగ్

యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ స్పందించారు. భారత సైన్యాన్ని ఎవరైనా 'మోదీ సేన' అంటే వారు దేశద్రోహులే’ అని అన్నారు.

ఘజియాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో వీకే సింగ్ తరపున ఎన్నికల ప్రచారం చేస్తూ ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

''కాంగ్రెస్ వాళ్లు ఉగ్రవాదులకు బిర్యానీలు పెడతారు. మోదీ సేన వారిని కాల్చేస్తుంది'' అని ఆదిత్యనాథ్ అన్నారు.

తెలుగు సబ్‌టైటిల్స్ ఉన్న వీకే సింగ్ ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి

వీడియో క్యాప్షన్, 'భారత సైన్యాన్ని మోదీ సేన అంటే దేశద్రోహమే’ : వీకే సింగ్

వీకే సింగ్‌ను ఇంటర్వ్యూ చేసిన బీబీసీ ప్రతినిధి జుగల్ పురోహిత్ ఇలాంటి వ్యాఖ్యలు సరైనవేనా అని ఆయనను ప్రశ్నించారు.

''మనం ఏ సైన్యం గురించి మాట్లాడుతున్నాం? భారత సైన్యం గురించా? రాజకీయ కార్యకర్తల గురించా? బీజేపీ ప్రచారంలో భాగమయ్యే ప్రతి ఒక్కరూ తమను తాము సైనికుడిగానే భావిస్తారు. సందర్భం ఏంటన్నది నాకు తెలియదు. భారత సైన్యాన్ని 'మోదీ సేన' అనడం తప్పు మాత్రమేకాదు.. అన్నవారు దేశద్రోహులు కూడా. సైన్యం ఏ రాజకీయ పార్టీకీ చెందదు'' అని వీకే సింగ్ బదులిచ్చారు.

వీకే సింగ్ పూర్తి ఇంగ్లీష్ ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

సైన్యానికి రాజకీయ రంగు పులుముతున్నారంటూ నావికా దళ మాజీ అధిపతి అడ్మిరల్ రామ్‌దాస్, నార్తర్న్ కమాండ్ మాజీ అధిపతి జనరల్ హుడా చేసిన ఆరోపణలపైనా వీకే సింగ్ స్పందించారు.

''రాజకీయ రంగు పులుముతున్నారని ఎవరూ అనలేదు. సైన్యం ఘనతలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నట్లుగా కనబడుతోందని మాత్రమే అన్నారు. రాజకీయ కార్యక్రమాల్లో సీఆర్పీఎఫ్ జవాన్ల ఫోటోలు ఉంటే తప్పేముంది. అమరులకు నివాళులు అర్పించడం రాజకీయం చేసినట్లా?'' అని వీకే సింగ్ చెప్పారు.

సర్జికల్ స్ట్రైక్స్‌పై సినిమా రూపొందడం గురించి మాట్లాడుతూ.. ''ప్రతి అంశంపైనా సినిమాలు వస్తుంటాయి. 90వ దశకంలోనూ ఉగ్రవాదంపై ప్రహార్ అనే చిత్రం వచ్చింది'' అని అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)