ఆవలింత ఎందుకు వస్తుంది, ఎవరైనా ఆవలిస్తే మీకూ ఆవలింత ఎందుకు వస్తుంది

ఆవలింత ఎందుకు వస్తుంది?

ఆవలించడం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదలవుతుంది. జీవితాంతం ఉంటుంది. మనం జీవితకాలంలో సగటున 2.4 లక్షల సార్లు ఆవలిస్తాం. మరి ఆవలింతకు అసలు కారణమేంటి? ఇది రక్తంలో ఆక్సిజన్ సరఫరాను పెంచేందుకేనని అనుకొనేవారు. ఆక్సిజన్ సరఫరాను పెంచేందుకు ఇది అంత ప్రభావవంతమైనది కాదని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. ఇంతకూ ఆవలింతలు ఎందుకు వస్తాయి?

ఇది సైన్స్‌కు ఒక మిస్టరీ.

ఆవలింతలు ఎందుకు వస్తాయనేదానికి సంబంధించి రెండు థియరీలు ఉన్నాయి.

మనం అలసిపోయినా, విసుగు చెందినా మెదడు ఉష్ణోగ్రత పెరుగుతుంది. అప్పుడు మనం చల్లటి గాలిని పీల్చుకుంటాం. మెదడును చల్లబరిచేందుకు, ఉత్తేజాన్ని ఇచ్చేందుకు అది దోహదం చేస్తుంది. అప్పుడు మనలో అప్రమత్తత పెరుగుతుంది.

ఆవలిస్తున్న యువకుడు

రెండో థియరీ- సమూహ స్వభావం. ఆవలింత ఒకరి నుంచి మరొకరికి పాకుతుంది. ఇదో రకం కమ్యూనికేషన్ కావొచ్చని కొందరు పరిశోధకులు చెబుతారు. ఒక సమూహంలోని అందరి జీవ గడియారాన్ని ఒకేలా ఉంచేందుకు ఉద్దేశించినది కావొచ్చని అంటారు. ఆవలింత ఒకరి నుంచి మరొకరికి పాకినప్పుడు ప్రతి ఒక్కరూ ఒకే స్థాయి అప్రమత్తతకు చేరుకుంటారు.

ఒకరిని చూసి మరొకరు ఆవలించడమనేది సహానుభూతికి సంబంధించినదని కొందరు శాస్త్రవేత్తలు చెబుతారు.

మనుషులే కాదు, జంతువులూ ఆవలిస్తాయి. యజమాని ఆవలింతను చూసినప్పుడు కుక్కలు ఆవలించడం తరచూ జరుగుతుంటుంది.

వీడియో క్యాప్షన్, ఆవలింత ఎందుకు వస్తుంది? ఎవరైనా ఆవలిస్తే మీకూ ఆవలింత ఎందుకు వస్తుంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)