800 కేజీల భగవద్గీత ఎక్కడుందో తెలుసా?

ప్రపంచంలోనే అత్యంత బరువైన భగవద్గీత ఎక్కడుందో తెలుసా?
ఈ భగవద్గీత గ్రంథం బరువు 800 కేజీలు. దీనిలో 670 పేజీలున్నాయి. దీని తయారీకి రూ.1.5 కోట్లు ఖర్చైంది.
దీన్ని ఇటలీలోని మిలాన్ నగరంలో ముద్రించారు. దీన్ని మామూలు పుస్తకంలాగా పైకి లేపడం అసాధ్యం. దీన్ని కదపాలన్నా, పైకి ఎత్తాలన్నా హైడ్రాలిక్ యంత్రం కావాలి.
'గీతా పంపిణీ మిషన్'కు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ భారీ గ్రంథాన్ని సముద్ర మార్గంలో భారత్‌కు తీసుకొచ్చారు.
ఇప్పుడు ఈ గీత దిల్లీలోని ఇస్కాన్ ఆలయంలో ఉంది.
"దీన్ని చాలా దృఢంగా, నీటిలో తడిసినా ఏమీ కాకుండా తయారు చేశారు. దీనికోసం ఇటాలియన్ యూపస్ సింథటిక్ పేపరు వాడారు. మొట్టమొదటిసారి 2018 నవంబర్ 11న ఇటలీలో దీన్ని ప్రదర్శించారు" అని ఇస్కాన్-దిల్లీ వైస్ ప్రెసిడెంట్ వ్రజేంద్ర నందన్ దాస్ తెలిపారు.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









