భోజనం చేయగానే పొట్ట ఉబ్బరంగా ఉంటోందా? పెరిటోనియల్ కేన్సర్ కావచ్చు

ఫొటో సోర్స్, Alamy
భోజనం చేయగానే పొట్ట ఉబ్బరంగా ఉంటోందా? గ్యాస్/ ఎసిడిటీ సమస్య కూడా ఉందా? ఈ లక్షణాలను అశ్రద్ధ చేయకండి. ఇదో రకమైన కేన్సర్ కావచ్చు.
ఇది ప్రైమరీ పెరిటోనియల్ కేన్సర్ కావచ్చంటున్నారు మ్యాక్స్ కేన్సర్ కేర్ ఆస్పత్రి డాక్టర్ ప్రమోద్ కుమార్.
"ఈ కేన్సర్ సాధారణంగా మహిళల్లో ఎక్కువగా వస్తుంది. పురుషులకు కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. పొత్తికడుపులోని లోపలి పొరను పెరిటోనియమ్ అంటారు. ప్రసవ సమయంలో పిండం అభివృద్ధి చెందే సమయంలో కొన్ని కణాలు పిండంలోనే ఉండిపోవచ్చు. పెరిటోనియల్ కేన్సర్‌కు ఇవే కారణం" అని ఆయన చెబుతున్నారు.
సినీ నటి నఫీసా అలీ ఈ రకమైన కేన్సర్‌తో బాధపడుతున్నారు.
"కొన్ని లక్షణాల ఆధారంగా దీన్ని గుర్తించవచ్చు. పొట్ట ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు, తరచూ ఎసిడిటీ ఉంటే నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోండి. అప్పటికీ, లక్షణాలు అలాగే ఉంటే సీటీ స్కాన్ చేయించుకోవాలి. ఇది చాలా అరుదుగా వచ్చే కేన్సర్. పది లక్షలమందిలో 6-7 మందికి ఇది వస్తుందని అంచనా" అని ప్రమోద్ తెలిపారు.
ఇవి కూడా చదవండి.
- ఊబకాయం కేన్సర్‌కు దారితీయొచ్చు... జాగ్రత్త
- 'వక్షోజం తొలగించిన చోట టాటూ ఎందుకు వేయించుకున్నానో తెలుసా...'
- గౌతమి: కేన్సర్‌ను ఇలా జయించారు
- అనంత్‌కుమార్‌కు సిగరెట్లు, మద్యం అలవాటు లేదు.. మరి ఆయనకు లంగ్ క్యాన్సర్ ఎలా వచ్చింది?
- సొనాలీ బింద్రేకు క్యాన్సర్ ఎలా వచ్చింది
- రొమ్ము క్యాన్సర్‌ను సూచించే 12 లక్షణాలు
- కేన్సర్‌తో పోయిన గొంతు రూ.60తో తిరిగి వస్తుంది!
- కాంగ్రెస్ భరోసా సభ: ‘ఏపీ ప్రత్యేక హోదాను ఏ శక్తి అడ్డుకోలేదు’ -రాహుల్‌గాంధీ
- కొండవీడు రైతు కోటయ్యది హత్యా... ఆత్మహత్యా...
- #WhyModi: మళ్లీ ప్రధానిగా మోదీనే ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





