#MyVoteCounts: ఉద్యోగాలు ఇచ్చే పార్టీకే ఓటేస్తా

- రచయిత, రిపోర్టింగ్: అనఘా పాఠక్, షూట్ ఎడిట్: పీయూష్ నాగ్‌పాల్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
కోట్ల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని 2014 ఎన్నికల ముందు రాజకీయ నాయకులు పెద్దఎత్తున హామీలు ఇచ్చారు.
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, దేశంలో గతేడాది (2018) దాదాపు కోటి 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. 2018 డిసెంబర్ నెలలో నిరుద్యోగిత రేటు 7.4 శాతం ఉంది. గడచిన 15 నెలల్లో ఇదే అధికం.
#MyVoteCounts సిరీస్‌లో భాగంగా.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేయబోతున్న యువతుల మనోగతాన్ని, వారు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు ఏమిటి? నిరుద్యోగ సమస్య గురించి వారేమంటున్నారు? అన్నది తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నిస్తోంది.
తాజాగా పంజాబ్‌లోని బర్నాలా పట్టణానికి చెందిన 19 ఏళ్ల ననితా సోహెల్‌తో బీబీసీ మాట్లాడింది.
ఈ యువతి ఏమంటున్నారో ఆమె మాటల్లోనే..
నాకు 18 ఏళ్లు దాటాయి. ఇక డబ్బుల కోసం మా అమ్మానాన్నలపై ఆధాపడలేను. అలాగని, బతుకుదెరువు కోసం విదేశాలకూ వెళ్లను.
ఎలిమెంటరీ స్కూల్ టీచర్ శిక్షణ పొందుతున్నాను. ఈ కోర్సులో భాగంగా ఓ ప్రభుత్వ పాఠశాలలో ట్రైనీగా పనిచేస్తున్నా.
యువతకు ఉద్యోగ భరోసా కల్పించే పార్టీకే ఈసారి ఎన్నికల్లో ఓటేస్తా.
ఈ ట్రైనింగ్ పూర్తయ్యాక మంచి ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఉన్నాను. భవిష్యత్తుపై అభద్రతాభావంతో నాలాగే పంజాబ్‌లో చాలామంది ఉన్నారు.
ఇక్కడున్న వారికే కాదు, విదేశాలకు వెళ్లిన యువతకు కూడా భవిష్యత్తుపై భరోసా లేదు.
విదేశాలకు వెళ్లినవారిలో కొందరు షాపింగ్ మాల్స్‌లో బ్రెడ్ ప్యాకింగ్ చేస్తున్నారు. కొందరు పిజ్జా దుకాణాల్లో, బార్లలో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

నాకంటే పెద్దవాళ్లు ఎంతోమంది ఖాళీగా ఉంటున్నారు. వారి పరిస్థితి చూస్తే బాధేస్తుంది. వాళ్లు చదువుకున్నారు, కానీ ఉద్యోగాలు లేవు. చాలామంది వారి ఖర్చులను కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితి నాకు రాకూడదు.
ప్రభుత్వం, పార్టీలు నిరుద్యోగ సమస్య గురించి ఎన్నికల ముందు పెద్దగా పట్టించుకుంటాయని నేను అనుకోవట్లేదు. బహుశా.. దాని వల్ల వారికి పెద్దగా ఓట్లు రావేమో.
వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వ టీచర్ కావాలన్నది నా ఆశ. ఇక్కడే ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తా. ఎట్టి పరిస్థితుల్లోనూ నా దేశాన్ని వదిలి బతుకుదెరువు కోసం మరో దేశం వెళ్లను.
అయితే, ప్రభుత్వం నాకోసం ఏం చేస్తుందన్నది మాత్రం తెలియదు.
ఇవి కూడా చదవండి:
- లక్ష ఉద్యోగాలు.. ఇవ్వకపోతే అప్పుడడగండి
- తెలంగాణ: ఉద్యోగాల నియామకాలలో తేలని లెక్కలు
- ప్రభుత్వ ఉద్యోగాలు: పోస్టులు వందల్లో.. దరఖాస్తులు లక్షల్లో
- రోజ్ గోల్డ్: ఫ్యాషన్ ప్రపంచాన్ని ఊపేస్తున్న కొత్త రంగు
- ఆమె చనిపోతే రెండో బాలిక కూడా చనిపోతారు
- బస్సెక్కుంతుంటే చీర చిరిగిందని..
- కాఫీ ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- రైల్వే ఉద్యోగాలు: లక్ష పోస్టులకు రెండు కోట్ల దరఖాస్తులు
- లబ్..డబ్బు: ఉద్యోగాల భవిష్యత్ ఏంటి? ఏం చేస్తే జాబ్ గ్యారెంటీ ఉంటుంది?
- హిందూ సంస్థలకే కాదు, కుటుంబానికీ క్షమాపణ చెప్పను - కనకదుర్గ
- యూట్యూబ్‌లో లక్షల వ్యూస్ వస్తున్నా... ఈ బాలిక వీడియోలు చేయడం మానేసింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









