Ind vs Nz: భారత్ ఘన విజయం.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కైవసం

ఫొటో సోర్స్, Getty Images
భారత్-న్యూజీలాండ్ మధ్య మౌంట్ మాగనుయిలో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది.
మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే భారత జట్టు ఈ వన్డే సిరీస్‌ను గెలుచుకుంది.
రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్థ సెంచరీలతో టీమిండియా 43 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయ లక్ష్యం అందుకుంది.
ఓపెనర్ శిఖర్ ధవన్ 28 పరుగులకే అవుటైనా కెప్టెన్ కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ స్కోర్ బోర్టును పరిగెత్తించాడు. ఇద్దరూ ధాటిగా ఆడి స్కోరును 150 పరుగులు దాటించారు.
టీమ్ స్కోర్ 152 పరుగుల దగ్గర టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది.
రోహిత్ శర్మ 62 పరుగులకు శాంట్నెర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
తర్వాత కాసేపటికే 168 పరుగుల దగ్గర 60 పరుగులు చేసిన కోహ్లీ కూడా అవుట్ అయ్యాడు.
ధవన్ వికెట్ తీసిన బౌట్ బౌలింగ్‌లోనే కోహ్లీ కూడా అవుటయ్యాడు.
తర్వాత బరిలో ఉన్న అంబటిరాయుడు, దినేష్ కార్తీక్‌తో కలిసి జట్టుకు విజయం అందించాడు.
రాయుడు 42 బంతుల్లో 40 పరుగులు, దినేష్ కార్తీక్ 38 బంతుల్లో 38 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.
న్యూజీలాండ్ బౌలర్లలో బౌట్ రెండు వికెట్లు పడగొట్టగా, శాంట్నెర్‌కు ఒక వికెట్ దక్కింది.
ఈ వన్డేలో 3 వికెట్లు పడగొట్టిన మహమ్మద్ షమీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
పదేళ్ల తర్వాత భారత జట్టు న్యూజాలండ్‌లో వన్డే సిరీస్ గెలుచుకుంది.
అంతకు ముందు 2009లో ధోనీ కెప్టెన్సీలో టీమిండియా న్యూజీలాండ్‌లో ఐదు వన్డేల సిరీస్‌ను 3-1 తేడాతో గెలుచుకుంది. ఒక వన్డే వర్షం కారణంగా రద్దైంది.

ఫొటో సోర్స్, Getty Images
టేలర్ సెంచరీ మిస్
అంతకు ముందు టాస్ గెలిచిన న్యూజీలాండ్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది.
ఓపెనర్లు గప్తిల్, ముంట్రో ఇద్దరూ 25 పరుగులకే పెవిలియన్ చేరారు.
విలియమ్సన్ కూడా 28 పరుగులు చేసి అవుటవడంతో కివీస్ 59 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
కానీ, తర్వాత క్రీజులోకి వచ్చిన టేలర్, లాథంతో కలిసి స్కోరును ముందుకు నడిపాడు. ఇద్దరూ నాలుగో వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.
టేలర్(93) సెంచరీకి చేరువైన సమయంలో షమీ అతడిని అవుట్ చేశాడు. తర్వాత రెండు ఓవర్లకు లాథం కూడా 51 పరుగుల దగ్గర చాహల్ బౌలింగ్‌లో రాయుడికి క్యాచ్ ఇచ్చాడు.
ఇద్దరూ అవుటైన తర్వాత మిగతా బ్యాట్స్‌మెన్ అందరూ తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టారు.
కేవలం 65 పరుగులకు న్యూజీలాండ్ చివరి ఏడు వికెట్లను కోల్పోయింది.
49 ఓవర్లలో ఆలవుట్ అయిన న్యూజీలాండ్ భారత్‌కు 244 పరుగుల విజయలక్ష్యం అందించింది.
భారత బౌలర్లలో షమీ 41 పరుగులకు 3 వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ కుమార్, చాహల్, పండ్యా రెండేసి వికెట్లు తీశారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
ఇవి కూడా చదవండి:
- యూట్యూబ్‌లో 13.5 కోట్ల మంది ఫాలోవర్లున్న ఈ బాలిక వీడియోలు చేయడం మానేసింది
- హిందూ సంస్థలకే కాదు, కుటుంబానికీ క్షమాపణ చెప్పను - కనకదుర్గ
- అరకు: కాఫీ ఆకులతో గ్రీన్ టీ
- కాఫీ పైన సెల్ఫీ... మీకూ కావాలా?
- కాఫీ ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- పవన్ కల్యాణ్‌కు ఫిన్లాండ్ విద్యా విధానం ఎందుకంతగా నచ్చింది?
- తెలంగాణ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో అంధ విద్యార్థుల మార్చ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








