పీవీ సింధు విజయం: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌గా చరిత్ర సృష్టించిన తెలుగుతేజం..

ఫొటో సోర్స్, Getty Images
తెలుగుతేజం, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ 2018లో జపాన్‌కు చెందిన నొజోమీ ఒకుహరాను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది.
తొలి గేమ్‌ను 21-19తో గెలుచుకున్న సింధు, రెండో గేమ్‌లో 21-16తో విజయం సాధించింది.
ప్రతిష్ఠాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారిణి విజేతగా నిలవడం ఇదే తొలిసారి. గత ఏడాది ఈ టోర్నీలో సింధు రన్నరప్‌గా నిలిచారు.
ఫైనల్స్ వరకు వచ్చి ఓడిపోతారనే విమర్శలకు సింధు ఈ విజయంతో బదులిచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
టైటిల్ పోరులో సింధు-ఒకుహారాలు నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డారు. తొలి గేమ్‌లో సింధు 14-6 తేడాతో ఆధిక్యంలో ఉన్న దశలో ఒకుహరా వరుసగా నాలుగు పాయింట్లు సాధించి సింధు ఆధిక్యాన్ని తగ్గించింది.
ఆ తర్వాత ఒకుహరా రెండు పాయింట్లు సాధించగా, సింధు పాయింట్ మాత్రమే సాధించింది. ఈ దశలో ఒకుహరా నాలుగు పాయింట్లు సాధించగా, సింధు పాయింట్ దక్కించింది. దాంతో స్కోరు 16-16తో సమమైంది.
ఆ వెంటనే సింధు వరుస పాయింట్లతో పైచేయి సాధించి తొలి గేమ్ దక్కించుకున్నారు.
రెండో గేమ్‌లో సింధు ఏ దశలోనూ ఆధిక్యాన్ని కోల‍్పోకుండా గేమ్, మ్యాచ్ గెలుచుకున్నారు.
కాగా ఈ ఫైనల్‌కు ముందు గ్వాంగ్‌ఝౌలో శనివారం జరిగిన మ్యాచ్‌లో రత్చనోక్ ఇంతనోన్‌పై 21-16, 25-23 తేడాతో సింధు విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.
ఫైనల్ చేరే క్రమంలో సింధు యమగుచి, తై జుయింగ్ వంటి అగ్రశ్రేణి షట్లర్లను ఓడించారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రా, తెలంగాణ, తృతీయ ఫ్రంట్లపై కర్ణాటక ఫలితాల ప్రభావం ఎంత?
- కేసీఆర్ ప్రెస్‌మీట్: ''చంద్రబాబు ఇచ్చిన గిఫ్ట్‌కు.. నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తా''
- మమతా బెనర్జీ మంతనాలు దేని కోసం?
- టీఆర్ఎస్ ప్రస్థానం: పోరు నుంచి పాలన వరకు కారు జోరు
- అభిప్రాయం: ‘యాంటీ కాంగ్రెస్’ చంద్రబాబుకు ఇప్పుడు రాహుల్ గాంధీతో స్నేహం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








