ఆస్ట్రేలియా వర్సెస్ భారత్: ఎన్నాళ్లకు.. ఎన్నాళ్లకు.. ఎన్నాళ్లకు..

మ్యాచ్ రికార్డులు

ఫొటో సోర్స్, Getty Images

ఆస్ట్రేలియాలో ఆతిథ్య దేశంపై తొలి టెస్టులోనే విజయం సాధించిన భారత్ ఎన్నో రికార్డులు అందుకుంది.

ఇప్పటివరకూ భారత్ ఆస్ట్రేలియాతో ఆ దేశంలో ఆడిన ఏ టెస్ట్ సిరీస్‌లోనూ మొదటి మ్యాచ్ గెలవలేదు.

ఇప్పుడు అడిలైడ్ టెస్టులో విజయంతో భారత్ ఆ రికార్డు కూడా బద్దలు కొట్టింది.

భారత్ ఈ విజయంతో ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన సిరీస్ తొలి టెస్టులో ఆ దేశాన్ని ఓడించిన రెండో ఆసియా దేశంగా నిలిచింది.

ఇంతకు ముందు పాకిస్తాన్‌కు ఇలాంటి విజయమే దక్కింది. ఇప్పుడు టీమిండియా అరుదైన విజయంపై బీసీసీఐ సంతోషం వ్యక్తం చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

"అడిలైడ్‌తో 'లవ్ అఫైర్‌'లో టీమిండియా మరో అద్భుత అద్యాయం జోడించిందని" బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.

ఈ విజయంతో కెప్టెన్ కోహ్లీ దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో టెస్ట్ మ్యాచ్ గెలిచిన మొట్టమొదటి ఆసియా కెప్టెన్‌గా అరుదైన ఘనత సాధించాడు.

అశ్విన్ మొత్తం ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియాలో ఇది అతడి అత్యుత్తమ ప్రదర్శన

india win

ఫొటో సోర్స్, Getty Images

ఇది బౌలర్ల విజయం

ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లను ఏ దశలోనూ కోలుకోకుండా చేశారు.

అందుకే, విజయం తర్వాత తన బౌలర్లను కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆకాశానికెత్తేశాడు.

బౌలర్లు తమకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సమర్థంగా ఉపయోగించుకున్నారని చెప్పాడు.

పుజారా, రహానే బ్యాటింగ్‌పై కూడా ప్రశంసించాడు. ఇద్దరూ ఈ విజయానికి పునాదులు వేశారన్నాడు.

మిడిల్ ఆర్డర్ తర్వాత అందరూ వరసగా పెవిలియన్ చేరడంపై ఆందోళన వ్యక్తం చేశాడు.

ఈ విజయం తర్వాత సునీల్ గావస్కర్ "భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 15 పరుగుల లీడ్ వచ్చినా ఆత్మవిశ్వాసంతో కనిపించిందని" అన్నారు.

"ఈ ఓటమితో ఆస్ట్రేలియాపై కచ్చితంగా ఒత్తిడి పెరుగుతుంది" అని అన్నారు.

india win

ఫొటో సోర్స్, Getty Images

పదేళ్ల క్రితం ఇదే అద్భుతం

2008 తర్వాత భారత్ ఆస్ట్రేలియాపై మళ్లీ టెస్టుల్లో విజయం సాధించింది.

2008లో జనవరి 16-20 మధ్య జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్ విజయం తర్వాత మళ్లీ ఆ జట్టు ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించడం ఇప్పుడే జరిగింది.

పెర్త్, డబ్ల్యుఏసీఏ గ్రౌండ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో గెలిచిన ఆ మ్యాచ్‌లో ఇర్ఫాన్ పఠాన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

ఉత్కంఠగా సాగిన పెర్త్ టెస్ట్

ఆ మ్యాచ్‌ కూడా అడిలైడ్ టెస్ట్‌లాగే పోటాపోటీగా జరిగింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 330 పరుగులు చేసింది. రాహుల్ ద్రావిడ్ 93 పరుగులు చేశాడు.

తర్వాత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

కుంబ్లే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2008లో టెస్ట్ గెలిచిన ఆనందంలో కెప్టెన్ కుంబ్లే

రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 294 పరుగులకే ఆలౌట్ అయ్యింది. లక్ష్మణ్ 79 పరుగులు చేశాడు.

తర్వాత 400 పరుగులకు పైగా లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 340 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

ఆట ముగియడానికి అరగంట ముందే భారత జట్టు ఆతిథ్య జట్టును పెవిలియన్ పంపింది.

ఆ సిరీస్‌లో జట్టుకు కెప్టెన్‌గా ఉన్న అనిల్ కుంబ్లే ఈ గెలుపును తన అత్యుత్తమ విజయంగా వర్ణించాడు.

ఇప్పుడు నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టులోనే విజయం సాధించిన కోహ్లీ సేన సంబరాలు చేసుకుంది.

india win

ఫొటో సోర్స్, Getty Images

ఆస్ట్రేలియాకు అరుదైన రికార్డ్ మిస్

ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఉంటే అది కూడా ఆ జట్టుకు ఒక రికార్డ్ అయ్యుండేది.

మొదటిసారి ఆస్ట్రేలియా హోం గ్రౌండ్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో 323 పరుగుల లక్ష్యాన్ని చేజ్ చేసిన జట్టుగా నిలిచేది.

ఇప్పటివరకూ ఆ జట్టు నాలుగో ఇన్నింగ్స్‌లో చేజ్ చేసిన అత్యధిక పరుగులు 315 మాత్రమే.

1902లో జరిగిన ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆరు వికెట్లు కోల్పోయి ఈ విజయం అందుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)