వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై దాడి: శ్రీనివాస రావు ఎవరు? ఎందుకు దాడి చేశాడు?

ఫొటో సోర్స్, BBC/Ugc
విశాఖ విమానాశ్రయంలో ఏం జరిగింది అనే అంశంపై వైజాగ్ వెస్ట్ ఏసీపీ అర్జున్, ఏడీసీపీ పాత్రుడు విలేకర్లతో మాట్లాడారు.
నిందితుడు తూర్పుగోదావరి జిల్లా, ముమ్మడివరం మండలం, ధనియాలపాలేనికి చెందిన జె.శ్రీనివాస్‌గా గుర్తించామని తెలిపారు. ఆయన వైసీపీ అభిమానని వివరించారు.
వైజాగ్ విమానాశ్రయం సీఎస్ఎఫ్ సెక్యురిటీ పరిధిలో ఉందని.. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
సిట్ దర్యాప్తులో మిగతా వివరాలు తెలుస్తాయని చెప్పారు.
నిందితుడు శ్రీనివాస్ వయసు 30 ఏళ్లు ఉంటాయని వెల్లడించారు.

ఫొటో సోర్స్, ugc
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జగన్ పై 12.34 నిమిషాలకు దాడి జరిగిందని.. ఆయన జగన్‌పై దాడి చేసిన వెంటనే పోలీసులు.. అక్కడున్నవారు అతన్ని అదుపులోకి తీసుకున్నారని వివరించారు.
పాపులారిటీ కోసం శ్రీనివాస్ ఈ దాడి చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.

ఫొటో సోర్స్, Chandrakanth
24 గంటల పాటు విశ్రాంతి అవసరం
విశాఖ విమానాశ్రయంలో కత్తిపోటుకు గురైన జగన్ కు హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స అందించారు.
ఆయన ఎడమ భుజంపై ఉన్న గాయానికి తొమ్మిది కుట్లు వేశారు.
జగన్ రక్త నమూనాలను పరీక్షిస్తున్నారు. 24 గంటల పాటు విశ్రాంతి తీసుకోవాలని జగన్ కు వైద్యులు సూచించినట్టు సమాచారం.
మరోవైపు ఆసుపత్రి వద్ద భారీ భద్రతను ఏర్పాుటు చేశారు. ఆసుపత్రికి జగన్ బంధువులంతా చేరుకున్నారు.
- పాదయాత్రలో జగన్ ఇస్తున్న హామీల అమలు సాధ్యమేనా?
- సీబీఐ వర్సెస్ సీబీఐ: డైరెక్టర్ అలోక్ వర్మ తొలగింపుకు.. రఫేల్ విచారణకు సంబంధముందా?
- సీబీఐ కుమ్ములాట : కాకినాడ సానా సతీశ్ బాబు ఫిర్యాదు ఎందుకు సంచలనమైంది?
- డేజా వూ: ‘ఎక్కడో చూసినట్టుందే’ అని మీరెప్పుడైనా అనుకున్నారా? అయితే ఈ 8 విషయాలూ మీకోసమే
- ‘గూగుల్ క్యాంపస్ మాకొద్దు’.. బెర్లిన్లో ఆందోళనలు
- ఒబామా, హిల్లరీ నివాసాలకు ‘పేలుడు పదార్థాలు’
- పటేల్ విగ్రహానికి రూ.2989 కోట్లు.. స్థానిక రైతులకు నీళ్లు కరువు
- విరాట్ కోహ్లి : విశాఖ వన్డేలో ప్రపంచ రికార్డు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









