మహారాష్ట్రలో దాడికి ప్లాన్ వేసిన హిందూ కార్యకర్తలు... ఒకరి ఇంట్లో 22 బాంబులు: ఏటీఎస్

ముగ్గురు అరెస్ట్

ఫొటో సోర్స్, SANATAN SANSTHA

    • రచయిత, ప్రశాంత్ నానావరే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ముగ్గురిని అరెస్ట్ చేసింది. ఈ ముగ్గురు నిందితులు- వైభవ్ రావుత్, శరద్ కలాస్కర్, సుధనా గోండ్లేకర్‌లు మహారాష్ట్రలో పలు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ప్రణాళికలు వేశారని ఏటీఎస్ తెలిపింది. వీరికి ముంబయి ప్రత్యేక కోర్టు ఆగస్టు 18 వరకూ రిమాండు విధించింది.

ఏటీఎస్ చెప్పిన వివరాల ప్రకారం, కలాస్కర్ ఇంటిలో బాంబులు ఎలా తయారుచేయాలో వివరించే కాగితాలు దొరికాయి.

నాలాసొపారా ప్రాంతంలో ఉన్న వైభవ్ రావుత్ ఇంట్లో 22 నాటు బాంబులు, జిలెటిన్ స్టిక్స్ లభించాయని కూడా ఏటీఎస్ తెలిపింది. ఈ ముగ్గురు వ్యక్తులు ఒకరినొకరు సంప్రదించుకునేవారని చెప్పింది.

పుణె, సతారా, నాలాసొపారా, ముంబయిలో కొందరు అజ్ఞాత వ్యక్తులు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని గతంలో ఏటీఎస్‌కు సమాచారం అందింది. దాంతో, అప్రమత్తమైన ఏటీఎస్ దాని మీద దర్యాప్తు చేసి ఈ ముగ్గురు నిందితులను గుర్తించింది. వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసింది.

వైభవ్ కు సాయం చేస్తాం-లాయర్

ఈ వైభవ్ రావుత్ ఎవరు?

ఈ ముగ్గురిలో వైభవ్ రావుత్ సనాతన సంస్థకు చెందిన సభ్యుడని చెబుతున్నారు. కానీ ఆ సంస్థ మాత్రం దీనిని ఖండించింది. వైభవ్ "హిందూ గోవంశ్ రక్షా సమితి" సభ్యుడని సనాతన సంస్థకు సంబంధించిన సునీల్ ధనావత్ చెప్పారు.

"వైభవ్ హిందూ కార్యకర్త, మేం అతడికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం" అని నిందితుల తరఫు న్యాయవాది సంజీవ్ పనాలేకర్ తెలిపారు.

"వైభవ్ గోరక్షకుడు, ఈద్ సమయంలో జంతువులను బలి ఇవ్వడాన్నిఅతడు వ్యతిరేకించాడు. ప్రభుత్వం అతడి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తోంది" అని సంజీవ్ ఆరోపించారు.

వైభవ్ రావుత్ గురించి గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు, సనాతన సంస్థకు సంబంధించిన పేజీలు వచ్చాయి. కానీ వాటిలో ప్రస్తుతం ఏ లింకులూ ఓపెన్ కావడం లేదు.

ముగ్గురు అరెస్ట్

ఫొటో సోర్స్, SANATAN SANSTHA

సుధనా గోండ్లేకర్ ఎవరు?

సుధనా గోండ్లేకర్‌ను శంభాజీ భిడేకు చెందిన 'శివ ప్రతిష్ఠాన్' సంస్థ కార్యకర్తగా చెబుతున్నారు.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, భీమా కోరెగావ్ హింస కేసులో పోలీసులు శంభాజీ భిడేను కూడా అనుమానితునిగా భావించారు. అయితే, ఆ తర్వాత ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలూ లభించలేదు.

సుధనా గోండ్లేకర్శి శివ ప్రతిష్ఠాన్ సంస్థ కార్యకర్తగా గతంలో పని చేశాడని, నాలుగేళ్ల నుంచీ ఆయనకు ఈ సంస్థతో ఎలాంటి సంబంధాలూ లేవని ఆ సంస్థకు చెందిన నితిన్ చౌగులే స్థానిక న్యూస్ చానళ్లకు తెలిపారు.

సనాతన్ సంస్థకు చెందిన చేతన్ రాజహంస్ ఈ చానళ్లతో మాట్లాడుతూ, సనాతన్ సంస్థ, శివ ప్రతిష్టాన్ రెండూ హిందూ సంస్థలే అని చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

సనాతన్ సంస్థ తీవ్రవాద సంస్థ: కాంగ్రెస్

"ఇంతకు ముందు కూడా సనాతన్ సంస్థ ఆలోచనా విధానం, బాంబు పేలుళ్లకు సంబంధించిన అంశాల్లో సందేహాలు వ్యక్తం అయ్యాయి. అందుకే దీనిని తీవ్రవాద సంస్థగా ప్రకటించాలి" అని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ చవాన్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీకే చెందిన సచిన్ సావంత్ ఒక ఫొటోను ట్వీట్ చేశారు. వైభవ్ రావుత్‌కు సనాతన్ సంస్థతో సంబంధాలు ఉన్నాయని అందులో ఆరోపించారు.

అంతకుముందు దాభోల్కర్, పన్సారే హత్య సహా గడ్కరీ రంగాయతన్, మడ్గావ్ బాంబు పేలుళ్లకు సంబంధించిన కేసుల్లో సనాతన్ సంస్థకు సంబంధించిన వారిని అరెస్టు చేశారు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)