ఇంటర్‌కాంటినెంటల్ కప్: కెన్యాపై 3-0 తేడాతో భారత్ విజయం

ఫొటో సోర్స్, FACEBOOK / SUNIL CHHETRI / BBC
ముంబయిలోని ఫుట్‌బాల్ ఎరెనా మైదానంలో జరిగిన ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లో భారత జట్టు కెన్యాను 3-0 తేడాతో ఓడించింది.
తన నూరవ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి రెండు గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌తో ఛెత్రి సాధించిన గోల్స్‌తో అతని అంతర్జాతీయ గోల్స్ మొత్తం సంఖ్య 59కి చేరింది.
కెప్టెన్ సునీల్ ఛెత్రీ మ్యాచ్ 68వ నిమిషంలో తొలి గోల్ సాధించగా, రెండో గోల్ జేజే లాల్‌పెఖ్లువా 71వ నిమిషంలో సాధించాడు.
మూడో, చివరి గోల్ మళ్లీ సునీల్ ఛెత్రి ఆట 92వ నిమిషంలో సాధించాడు. ఆటను ఐదు నిమిషాల పాటు పొడిగించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
మ్యాచ్‌కు జనాన్ని పిలిచాడు... విజయం సాధించాడు
అంతకు ముందు, ‘ప్లీజ్.. స్టేడియానికి రండి.. మా మ్యాచ్ చూడండి’ అన్న భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ ఛెత్రి చేసిన వీడియో ట్వీట్ ట్రెండ్ అయ్యింది.
తమకు మద్దతివ్వాలంటూ ఛెత్రి చేసిన విజ్ఞప్తికి పలువురు స్పందించారు. విరాట్ కొహ్లీ, రాజమౌళి, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇలా ఎందరో ఛెత్రికి మద్దతుగా నిలిచారు.
ఛెత్రి తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో ప్రజలను ఉద్దేశించి..
''మీరు మమ్మల్ని విమర్శించండి, దూషించండి. కానీ మా మ్యాచ్ చూడటానికి స్టేడియానికిరండి. మ్యాచ్ ఆడేటపుడు ప్రేక్షకులను చూస్తే మాకూ ఉత్సాహంగా ఉంటుంది. మేం ఇంకా బాగా ఆడగలం..'' అన్నాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
భారత జట్టు ఆడిన చివరి మ్యాచ్ చూడటానికి కేవలం 2,569మంది ప్రేక్షకులు మాత్రమే హాజరైన నేపథ్యంలో ఛెత్రి ఈ సందేశాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.
భారత్, న్యూజిలాండ్, కెన్యా, చైనా దేశాల మధ్య ఫుట్‌బాల్ ఇంటర్ కాంటినెంటల్ కప్ జరుగుతోంది. సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో భారత జట్టు 'బ్లూ టైగర్స్' చైనాపై 5-0తో విజయం సాధించింది.
ఫీఫా(ఎఫ్.ఐ.ఎఫ్.ఎ) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత జట్టు 97వ స్థానంలో నిలిచింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
‘‘నా మిత్రుడు ఛెత్రి చేసిన విజ్ఞప్తిని మీరు చూసే ఉంటారు. దయచేసి మీరు స్టేడియానికి వెళ్లి మ్యాచ్ చూడండి.. వాళ్లు చాలా కష్టపడి ఆడుతున్నారు. భవిష్యత్‌లో మీ పిల్లలు కూడా క్రీడాకారులయితే, వారి ఆటను చూడటానికీ ప్రేక్షకులు రావాలిగా మరి.. దేశంలో క్రీడా సంస్కృతిని ప్రోత్సహించండి.. '' అంటూ విరాట్ కొహ్లీ ఛెత్రికి మద్దతుగా నిలిచాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ఛెత్రి విజ్ఞప్తిని అందుకున్న తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో స్పందించారు. ‘ఫుట్‌బాల్ మ్యాచ్ చూడటానికి నేను వెళుతున్నా.. మరి మీ సంగతేమిటి?’ అని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
ఎస్.ఎస్. రాజమౌళి కూడా ఛెత్రికి మద్దతుగా ట్విటర్‌లో స్పందించారు. ప్రేమ, సంకల్పం రెండూ కలిస్తే.. దాన్ని ఆపడం కష్టం. మా మద్దతు ఎప్పటికీ ఉంటుంది అని ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, FACEBOOK / SUNIL CHHETRI / BBC
పాకిస్తాన్‌తోనే తొలి మ్యాచ్, తొలి గోల్..!
భారత ఫుట్‌బాల్ జట్టు సారథి సునీల్ ఛెత్రి.. తన వందో అంతర్జాతీయ మ్యాచ్‌ను సోమవారం ఆడతారు. ఇంటర్నేషనల్ కప్ సిరీస్‌లో భాగంగా కెన్యాపై ఈ మ్యాచ్ ముంబైలో జరుగుతుంది.
ప్రాక్టీస్ సెషన్ ముందు మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్‌తో ఆడిన మ్యాచ్‌లో తను మొదటి గోల్ చేసిన సందర్భాన్ని ఛెత్రి గుర్తు చేసుకున్నాడు.
''భారత జట్టు తరఫున ఆడిన మొదటి మ్యాచ్ నాకు బాగా గుర్తుంది. అది పాకిస్తాన్‌తో ఆడాం. వేదిక కూడా పాకిస్తానే.. జట్టులో నేను, సయ్యద్ రహీమ్ నబీ ఇద్దరమూ కొత్త వాళ్లం. మొదట్లో మాకు మ్యాచ్‌లో ఆడే అవకాశం దొరకకపోవచ్చని భావించాం. కానీ సుఖ్విందర్ సింగ్ మాకు అవకాశం ఇచ్చారు. ఆటలో మొదటి గోల్ చేసినపుడు చాలా ఉద్వేగానికి లోనయ్యా. వెంటనే.. పాకిస్తాన్ అభిమానుల వద్దకు పరుగెత్తుకెళ్లి వేడుక చేసుకున్నా'' అన్నాడు.

ఫొటో సోర్స్, FACEBOOK / SUNIL CHHETRI / BBC
''భారత ఫుట్‌బాల్ జట్టుపై ఆశలు లేనివారందరూ స్టేడియానికి వచ్చి మా మ్యాచ్ చూడాలని కోరుతున్నా. మ్యాచ్ చూడటం వల్ల సమయం వృధా అని మీరు భావించవచ్చు. కానీ మీరొస్తే.. మా ఆట తీరు మెరుగవుతుందని నేను భావిస్తున్నా..'' అని వీడియో పోస్ట్‌లో సునీల్ ఛెత్రి అన్నాడు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)