సోషల్: "ఇది చిన్న సంఘటనే, ఎందుకంటే ఇందులో బీజేపీ నేతల ప్రమేయం ఉంది కదా!"

వారం రోజుల పాటు సామూహిక అత్యాచారం చేసిన తర్వాత బాలికను చంపేసి శరీరాన్ని అడవిలో ఇక్కడ పడేశారు (ఎడమవైపు) - కఠువా ఘటన చిన్నది అని వ్యాఖ్యానించిన జమ్మూ కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి కవీందర్ గుప్తా (కుడివైపు)
ఫొటో క్యాప్షన్, వారం రోజుల పాటు సామూహిక అత్యాచారం చేసిన తర్వాత బాలికను చంపేసి శరీరాన్ని అడవిలో ఇక్కడ పడేశారు (ఎడమవైపు) - కఠువా ఘటన చిన్నది అని వ్యాఖ్యానించిన జమ్మూ కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి కవీందర్ గుప్తా (కుడివైపు)

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కఠువా అత్యాచారం ఘటన 'చాలా చిన్న సంఘటన' అని వ్యాఖ్యానించిన జమ్మూ కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి కవీందర్ గుప్తాపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

ఓ ఎనిమిదేళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేస్తే... ఇది చిన్న ఘటన అని ఎలా అంటారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా దీనికి అంత ప్రాధాన్యం ఇచ్చి ఉండకూడదు అన్న కవీందర్ వ్యాఖ్యలను కూడా ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల వేదికలపై తప్పుబట్టారు.

మాటలనే అదుపులో పెట్టుకోలేని వీళ్లు ఇక రాష్ట్రాలను ఎలా పాలిస్తారు?

ఫొటో సోర్స్, Twitter

నోటినే అదుపులో పెట్టుకోలేని బీజేపీ నేతలు రాష్ట్రాలను ఎలా పాలిస్తారో అర్థం కావడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, న్యాయవాది కపిల్ సిబల్ ట్వీట్ చేశారు.

"కఠువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం చిన్న విషయం - కవీందర్ గుప్తా

నారదుడు గూగుల్ లాంటి వాడు - విజయ్ రూపానీ

మాటలనే అదుపులో పెట్టుకోలేని వీళ్లు ఇక రాష్ట్రాలను ఎలా పాలిస్తారు?

దేశం మారిపోతోంది" అని కపిల్ సిబల్ పోస్ట్ చేశారు.

కవీందర్ వ్యాఖ్యల సంగతి సరే... ఇతర కేసుల పరిస్థితేంటి

ఫొటో సోర్స్, Twitter

కవీందర్ వ్యాఖ్యల సంగతి సరే... ఇతర కేసుల పరిస్థితేంటి అంటూ @amitwriter అనే వ్యక్తి ప్రశ్నించారు.

"అనుకున్నట్లే మీడియా కవీందర్ గుప్తా చేసిన వ్యాఖ్యలకు అత్యంత ప్రాధాన్యమిచ్చి ప్రసారం చేసింది. కానీ ముస్లింలు చేసిన అత్యాచారాల కేసుల పరిస్థితేంటి? మీడియా దృష్టిలో అవి చిన్నచిన్న సంఘటనలు. మీడియా ఎందుకు వాటి గురించి ప్రసారం చేయదు? ఈరోజుల్లో మీడియా కూడా ఉన్నత పదవుల్లో ఉండేవారికి అనుకూలంగా ప్రవర్తించడానికి అలవాటు పడింది. విలువలు లేవు" అని మీడియా సచ్ఛీలతను ప్రశ్నించారు.

బీజేపీ అత్యాచార నిందితులపట్ల సానుభూతితో ఉందనే విషయం సులువుగా అర్థమవుతుంది.

ఫొటో సోర్స్, Twitter

@KhushbooTweets అనే ట్విటర్ హ్యాండిల్ ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ వైఖరిని తప్పుబట్టారు.

"తెలివి లేని జమ్మూ కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి కవీందర్ గుప్తా కఠువా ఘటనను చాలా చిన్న ఘటన అన్నారు. దీన్ని చూస్తుంటే... బీజేపీ అత్యాచార నిందితులపట్ల సానుభూతితో ఉందనే విషయం సులువుగా అర్థమవుతుంది."

కేవలం ఇద్దరు మంత్రులను తొలగించడం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు.

ఫొటో సోర్స్, Twitter

"కవీందర్ గుప్తా వ్యాఖ్యలు చూస్తుంటే కఠువా దుర్ఘటనపై బీజేపీ అభిప్రాయం తెలుస్తోంది. కేవలం ఇద్దరు మంత్రులను తొలగించడం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు" అని మరో యూజర్ @bukharishujaat పోస్ట్ చేశారు.

కమ్యూనలిజాన్ని అనుసరించే కవీందర్ గుప్తాలాంటి వ్యక్తి నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలం?

ఫొటో సోర్స్, Twitter

ఇక @IdreesFaraz1 అనే మరో ట్విటర్ హ్యాండిల్... "కమ్యూనలిజంని అనుసరించే కవీందర్ గుప్తాలాంటి వ్యక్తి నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలం?" అని పేర్కొంది.

రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ 2019లో బీజేపీని ఓడించాలని మోదీ కోరుకోనవసరం లేదు.

ఫొటో సోర్స్, Twitter

"రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ పార్టీ 2019లో బీజేపీని ఓడించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బిప్లవ్ దేవ్, విజయ్ రూపానీ, సత్య పాల్, కవీందర్ గుప్తాలాంటి వాళ్లు మోదీకి ఆ పని చేసిపెడతారు. మోదీ చేయాల్సిందల్లా చూస్తూ ఉండటమే" అంటూ బీజేపీ నేతల బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు ఆ పార్టీకి నష్టం చేస్తాయంటూ ట్వీట్ చేశారు @Vivekuksood.

మీ నేతలకు మీరు ఎలా ఉరిశిక్ష వేయగలరు?

ఫొటో సోర్స్, Twitter

"అవును, కవీందర్ గుప్తా చెప్పినట్లు ఇది చిన్న సంఘటనే. ఎందుకంటే ఇందులో బీజేపీ నేతల ప్రమేయం ఉంది కదా. మీ నేతలకు మీరు ఎలా ఉరిశిక్ష వేయగలరు?" అంటూ @Azhar02948583 కఠువా వ్యవహారంలో బీజేపీ స్పందన సరైనరీతిలో లేదన్నారు @Azhar02948583.

కవీందర్ గుప్తాను చూసి సిగ్గుపడుతున్నా.

ఫొటో సోర్స్, Twitter

"కవీందర్ గుప్తాను చూసి సిగ్గుపడుతున్నా. కవీందర్ గుప్తా! మీ కుటుంబంలో ఎవరికైనా ఇలా జరిగితే అప్పుడు కూడా మీరు ఇలాగే మాట్లాడగలరా?" అన్నారు @punitvarma.

ఇది చిన్నపిల్లపై జరిగిన అత్యాచారం. ఇది చిన్న సంఘటన కాదు.

ఫొటో సోర్స్, Twitter

"కవీందర్ గుప్తా అనే అజ్ఞానికి చెప్పండి... ఇది చిన్నపిల్లపై జరిగిన అత్యాచారం. ఇది చిన్న సంఘటన కాదు." ఇది @vivekuksood చేసిన మరో ట్వీట్.

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది సేపట్లోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కవీందర్ గుప్తాకు పదవిలో కొనసాగే హక్కు లేదని మరికొందరు పోస్టులు పెట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)