#BBCShe: ఆంధ్రా యూనివర్సిటీ అమ్మాయిలు ఏమంటున్నారు?
సాధారణంగా జర్నలిస్టులు డెస్కులో కూర్చొని, న్యూస్‌పేపర్ చదువుతూ, చాయ్ తాగుతూ ఆ రోజు ముఖ్యమైన విషయాలేంటో నిర్ణయించుకొని కథనాలు చేస్తారు.
కానీ BBCShe దానికి భిన్నం. మహిళలు ఏం కోరుకుంటున్నారో, వాళ్లకు ఎలాంటి కథనాలు కావాలో నేరుగా వాళ్లనే అడుగుతోంది.
అందులో భాగంగా BBCShe బృందం వైజాగ్ వెళ్లింది. ఆంధ్రా యూనివర్సిటీలో అమ్మాయిలతో మాట్లాడింది. వాళ్లు ఏం కోరుకుంటున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసింది.

ఈ క్రమంలో విద్యార్థినులు మనసు విప్పి బీబీసీతో మాట్లాడారు. తమ సమస్యలు పంచుకున్నారు. తమను ఇబ్బంది పెట్టే అంశాల గురించి చర్చించారు. సమాజంలోని కొన్ని కట్టుబాట్లను ప్రశ్నించారు.
హేతుబద్ధతలేని సంప్రదాయాలపై తమ అభిప్రాయాలను బయటపెట్టారు.
మీడియా తీరుతెన్నులపై మాట్లాడుతూ.. మీడియా నుంచి ఎలాంటి అంశాలు ఆశిస్తున్నారో వివరించారు.
వైజాగ్ నుంచి BBCShe ప్రయాణం మరో నగరానికి చేరనుంది. అక్కడ కూడా మహిళలతో మాట్లాడి వారి ఆలోచనలకు కథనాల రూపమిచ్చే ప్రయత్నం చేస్తుంది బీబీసీ.
ఇంతకీ.. ఈ 'బీబీసీ షీ' ప్రాజెక్ట్ ఏంటి?
చాలా సింపుల్.. మహిళలు ఎలాంటి కథనాలను కోరుకుంటున్నారో చెబితే అవే వారికి చేర్చడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.
సో... మీదే ఆలస్యం.. మీకెలాంటి కథనాలు కావాలో చెప్పండి. మీరేం కోరుకుంటున్నారో తెలపండి.
మీరు సూచించినవి బీబీసీ చేసి చూపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం!! మీ ఆలోచనలు మాతో పంచుకోండి.
బీబీసీ తెలుగు ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ పేజీల ద్వారా మీ అభిప్రాయాలను పంపించండి. #BBCShe హ్యాష్ ట్యాగ్ వాడడం మర్చిపోవద్దు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











