కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: మే 12న పోలింగ్, 15న ఫలితాలు

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Facebook/Election Commission of India

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే దశలో జరుగనుంది. మొత్తం 224 శాసనసభ స్థానాలకు మే 12న పోలింగ్ జరుగనుంది. ఫలితాలు మే 15న వెలువడనున్నాయి.

ఎన్నికల షెడ్యూలును భారత ఎన్నికల కమిషన్ మంగళవారం విడుదల చేసింది.

ప్రతీ నియోజకవర్గానికి ఒక పోలింగ్ కేంద్రం చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 224 పోలింగ్ కేంద్రాలను మొత్తం మహిళా సిబ్బందితోనే నిర్వహించనున్నారు.

ఈ పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బందితోపాటు భద్రతా సిబ్బంది కూడా మహిళలే ఉంటారు.

మొత్తం 224 స్థానాలకుగాను 36 స్థానాలను ఎస్సీలకు, 15 స్థానాలను ఎస్టీలకు రిజర్వు చేశారు.

ఓటర్ల తుది జాబితా ప్రకారం కర్ణాటకలో 4.968 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

ఎన్నికల షెడ్యూలు ప్రకారం ఎన్నికల ప్రక్రియ మే 18లోపు ముగుస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)