గ్రామీణ భారతానికి ఈ బడ్జెట్ ఏమిచ్చింది?

ఫొటో సోర్స్, SANJAY KANOJIA/Getty Images
ఈ బడ్జెట్‌లో గ్రామీణ, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. మరి గ్రామీణ భారతానికి ఈ బడ్జెట్‌లో కేటాయింపులు ఎలా ఉన్నాయి?
- 2022లోగా దేశంలోని పేదలందరి సొంతింటి కల నెరవేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో అరుణ్ జైట్లీ అన్నారు. అందుకోసం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన(గ్రామీణ) పథకం కింద 2018-19 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో 51 లక్షల గృహాలు నిర్మిస్తామని తెలిపారు. అందుకు రూ. 33,000 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్ పేర్కొన్నారు.
- ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన(గ్రామీణ) పథకానికి రూ.19,000 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 57,000 కిలోమీటర్ల రోడ్లు అభివృద్ధి చేస్తామన్నారు. దాంతో కార్మికులకు 28 కోట్ల 35 లక్షల పనిదినాల ఉపాధి లభిస్తుందని తెలిపారు.
- మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 230 కోట్ల పనిదినాలు కల్పిస్తామని, అందుకోసం రూ. 55,000 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. 2017-18 బడ్జెట్‌లో ఈ పథకానికి రూ. 48,000 కోట్లు కేటాయించారు.
- నేషనల్ రూరల్ జీవనోపాధి మిషన్ కింద రూ. 5,750 కోట్లు కేటాయించారు. ఈ మిషన్ కింద కొత్తగా 9 లక్షల స్వయం సహాయక సంఘాలను ప్రారంభిస్తారు. 5 లక్షల మంది మహిళా రైతులకు సాయం అందిస్తారు. 4 లక్షల మందికి శిక్షణ ఇస్తారు.
- వాటర్ షెడ్ పథకం కింద 1.30 లక్షల నీటి కుంటలను అభివృద్ధి చేస్తారు. 1.81 లక్షల హెక్టార్ల సాగు భూమికి నీటి భద్రత కల్పిస్తారు. దాంతో 5.01 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారు.
- భారత్‌నెట్ ఫేజ్ 2కి రూ. 10,000 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షల వైఫై హాట్‌స్పాట్‌లు ఏర్పాటు చేస్తారు.
- జాతీయ గ్రామీణ తాగునీటి పథకానికి రూ. 7,000 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద పైపు లైన్లు, నీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు చేస్తారు. దీంతో 84,000 మందికి ఉపాధి దొరుకుతుందని మంత్రి అరుజైట్లీ పేర్కొన్నారు.
ఇవి కూడా చూడండి:
- కేంద్ర బడ్జెట్‌లో మీ జేబుకు చిల్లు వేసే అంశాలు.. ఊరట కలిగించేవి
- మొట్టమొదటి కేంద్ర బడ్జెట్: 'ఆకలి తీర్చుకునేందుకు విదేశాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడలేం'
- జైట్లీ బడ్జెట్ రైతులకేమిచ్చింది?
- BUDGET LIVE : వ్యక్తిగత ఆదాయపన్ను శ్లాబులు యథాతథం, పది కోట్ల పేద కుటుంబాలకు ఆరోగ్య బీమా
- బడ్జెట్ అర్థం కావాలంటే ఈ 10 విషయాలు తెలియాల్సిందే!
- తిట్టారంటే జైలుకే: తెలంగాణ ప్రభుత్వ చర్యతో లాభమెంత? నష్టమెంత?
- రూపాయికి ఏమేం కొనొచ్చో చూడండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)




