కేంద్ర బడ్జెట్లో మీ జేబుకు చిల్లు వేసే అంశాలు.. ఊరట కలిగించేవి

ఐదొందల నోట్లు

ఫొటో సోర్స్, iStock

ఈ బడ్జెట్‌లో ఆదాయపు పన్ను శ్లాబుల్లో ఎటువంటి మార్పులు లేవు. అంటే 2017-18 ఆర్థిక సంవత్సరానికి పన్ను ఎలా చెల్లించారో ఈసారీ అంతే.

వ్యక్తిగత ఆదాయపు పన్నులో సింహభాగం వేతన జీవుల నుంచే ప్రభుత్వానికి సమకూరుతోంది. 2017-18లో 1.89 కోట్ల మంది రిటర్నులు దాఖలు చేశారు. రూ.1.44 లక్షల కోట్లు పన్ను రూపంలో చెల్లించినట్లు బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ చెప్పారు.

  • మెడికల్, రవాణా రీయంబర్స్‌మెంట్‌ మినహాయింపును రూ.40,000 ప్రతిపాదించారు. దీని ద్వారా రూ.8,000 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు.
  • విద్యా సుంకాన్ని 3 శాతం నుంచి 4 శాతానికి పెంచారు. తద్వారా రూ.11,000 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి అదనంగా చేకూరుతుంది. ఆమేరకు పన్ను చెల్లింపుదార్ల జేబులకు కత్తెర పడుతుంది.
వృద్ధులు

ఫొటో సోర్స్, Gettyimages

సీనియర్ సిటిజన్లు

  • 2018-19 బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం కాస్త ఊరటను ఇచ్చే చర్యలు తీసుకొంది. ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపు రూ.30,000 నుంచి రూ.50,000కు పెంచింది. కాబట్టి ఆరోగ్య బీమా మరింత మంది వృద్ధులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
  • అలాగే బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపును రూ.10,000 నుంచి రూ.50,000కు పెంచారు. వడ్డీ ఆదాయంపై ఆధారపడి జీవించే వృద్ధులకు ఇది మంచి వార్తే.
  • క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాలకు సంబంధించి పన్ను మినహాయింపును రూ.1,00,000కు పెంచారు.
  • పింఛను పథకం ప్రధాన మంత్రి వయ వందన యోజనను 2020 మార్చి వరకు పొడిగించారు. ఇందులో పెట్టుబడుల పరిమితిని రూ.7.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచారు.
ఉద్యోగి

ఫొటో సోర్స్, Getty Images

2017-18 - ఆదాయపు పన్ను శ్లాబులు, రేట్ల వివరాలు

60 ఏళ్లలోపు వారికి..

60-80 సంవత్సరాల మధ్య వయసు వారికి..

80 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు..

బడ్జెట్ ప్రభావం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)