హీరోయిన్‌ను వేధించిన కేసులో ఒక వ్యక్తి అరెస్ట్

ఫొటో సోర్స్, @ZAIRAWASIM_/INSTAGRAM
'దంగల్', 'సీక్రెట్ సూపర్‌స్టార్' వంటి సూపర్‌హిట్ సినిమాలలో నటించిన జైరా వసీంను వేధించిన కేసులో ముంబయి పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు.
నిందితుడి పేరు వికాస్ సత్‌పాల్ సచ్‌దేవ్ (39) అని స్థానిక జర్నలిస్టు సుప్రియా సోగ్లే తెలిపారు. దీనిపై ముంబయిలోని సహార్ పోలీసు స్టేషన్‌లో పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్టు - పీవోసీఎస్ఏ) చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
తనను ఓ ప్రయాణికుడు లైంగికంగా వేధించాడంటూ జైరా వసీం ఆదివారం నాడు ఫిర్యాదు చేశారు. ఎయిర్ విస్తారాకు చెందిన ఓ విమానంలో ఆమె ముంబయికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌పై జైరా ఓ వీడియోను విడుదల చేయగా సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
ఈ వ్యవహారంపై పౌర విమానయాన డైరెక్టరేట్‌కు ప్రాథమిక నివేదిక అందజేశామని ఎయిర్ విస్తారా ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




