20 విశ్వవిద్యాలయాలకు రూ.10 వేల కోట్లు ప్రకటించిన మోదీ

ఫొటో సోర్స్, TWITTER/PIB
పట్నా విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బిహార్‌కి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 20 విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసి, వాటి అభివృద్ధి కోసం రూ.10వేల కోట్ల రూపాయల నిధుల్ని అందించనున్నట్లు చెప్పారు.
పట్నా విశ్వవిద్యాలయానికి సెంట్రల్ యూనివర్సిటీ హోదా కల్పించమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో సహా ఎందరో బిహార్ వాసులు చాలా కాలంగా చేస్తున్న విజ్ఞప్తులకు మాత్రం ప్రధాని నుంచి సరైన సమాధానం రాలేదు.
యూనివర్సిటీకి కేంద్ర హోదాపై ప్రధాని నుంచి ఏదో ఒక స్పష్టత వస్తుందనుకున్న చాలా మంది విద్యార్థులు ఆయన ప్రసంగంతో నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీలో మోదీ ప్రసంగంపై నెటిజన్లు ఒక్కొక్కరూ ఒక్కో తరహాలో స్పందించారు. దీంతో #patnauniversity అనే హ్యాష్‌ట్యాగ్ ట్విటర్లో ట్రెండింగ్‌గా మారింది.

ఫొటో సోర్స్, TWITTER/PIB
‘పట్నా యూనివర్సిటీకి కచ్చితంగా కేంద్ర హోదా దక్కుతుంది. ప్రతి విద్యార్థికీ ఉచిత బ్యాంకు ఖాతాలను ఇచ్చి, వాటిలో తలో పది హేను లక్షల రూపాయలు కూడా వేస్తారు’ అంటూ అనీష్ దేవ్ అనే వ్యక్తి ట్విటర్‌లో వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు.
జోయ్ చౌదరీ అనే కుర్రాడు ట్వీట్ చేస్తూ ‘ఈ రోజు ప్రధాని ఫామ్‌లో లేరనుకుంటా, చాలా బోరింగ్ స్పీచ్ ఇచ్చారు’ అని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ప్రధాని తన ప్రసంగంలో, ‘బిహార్‌లో పవిత్రమైన గంగానది ఉంది, కావల్సినంత జ్ఞానమూ ఉంది’ అన్నారు. ఆ అంశంపైన దీపక్ రాజ్‌పుట్ అనే వ్యక్తి స్పందిస్తూ ‘మోదీజీ. జ్ఞానం దేశమంతటా ఉంది, కానీ ఉద్యోగాలేవి?’ అని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అదే విషయంపై నెవిన్ జాన్ అనే వ్యక్తి స్పందిస్తూ ‘బిహార్‌లో గంగా, జ్ఞానం ఉన్నాయి చాలు. ఇంకా ఉద్యోగాలూ, పెరిగిన జీఎస్‌టీ గురించి మనమెందకు బాధపడటం’ అన్నారు.
‘పట్నా యూనివర్సిటీకి ఇవాళ మీరు ఇచ్చింది చాలు, ఇంకా ఇచ్చి ఏడిపించకండి’ అంటూ నీరజ్ సింగ్ రాజ్‌పుట్ అనే కుర్రాడు ట్విటర్లో మోదీపై వ్యంగ్యంగా స్పందించాడు.
‘ఉన్నదంతా జయ్ షా కే ఇచ్చారు, ఇంక మాకు ఇవ్వడానికి ఏముంటుంది’ అంటూ ఫైసల్ షా అనే కుర్రాడు, అమిత్ షా తనయుడి వివాదానికీ, యూనివర్సిటీకి ముడిపెడుతూ ట్వీట్ చేశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
‘కల కలగానే మిగిలింది. ఆశలు ఆశలుగానే ఉండిపోయాయి. మోదీ యూనివర్సిటీకి వచ్చినంత మాత్రాన ఏమీ మారలేదు’ అంటూ అంకిత్ అనే కుర్రాడు ట్విటర్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
‘సార్, నాకు పది లక్షల రూపాయలు వద్దు. రూ.50 వేలను రూ.80 కోట్లుగా మార్చే ఫార్ములా ఏంటో చెప్పండి చాలు’ అని చెప్పే కార్టూన్‌ని రామన్ శర్మ అనే వ్యక్తి పోస్ట్ చేస్తూ, ‘పట్నా యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఇప్పుడు మోదీని ఇదే అడుగుతున్నారని విన్న’ అంటూ ట్వీటారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ప్రధాని ప్రకటించిన రూ.10వేల కోట్ల రూపాయల నిధుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నది సత్య ప్రకాష్ అనే వ్యక్తి అభిప్రాయం. ‘20 యూనివర్సిటీలకు రూ.10వేల కోట్లంటే ఒక్కో యూనివర్సిటీకి ఐదొందల కోట్ల రూపాయలు అందుతాయి. ఒక్క బీహెచ్‌యూ వార్షిక బడ్జెట్టే రూ.1200 కోట్లు. కాబట్టి మోదీ ప్రకటన వల్ల ఒరిగిందేముంది?’ అని ప్రకాష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
'మోదీ బిహార్ రావడం, ఒట్టి మాటలు చెప్పి వెళ్లడం, ఎప్పుడూ జరిగేది ఇదే కదా’ అని ఎండీ.షకీల్ ఇంతేకాబ్ అనే వ్యక్తి తన మనసులో మాటను ట్విటర్ ద్వారా బయటపెట్టారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)