రాహుల్ గాంధీ: ‘2030 నాటికి మోదీ చంద్రుణ్ని కూడా భూమిపైకి తీసుకొస్తారేమో!’

ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు కొనసాగిస్తున్నారు. ఆయన తాజాగా చేసిన రెండు ట్వీట్లు ప్రస్తుతం ట్రెండ్‌గా మారాయి.
వాటిలో మొదటిది..
"మోదీ జీ, మీ పార్టీ గుజరాత్‌లో 22 ఏళ్లుగా అధికారంలో ఉంది. ఇప్పుడు మీరు 2022 నాటికి ఇక్కడ పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్తున్నారు. నాకు ఇప్పుడనిపిస్తోంది.. 2025 నాటికి గుజరాత్‌లోని ప్రతి పౌరుడికీ ఓ రాకెట్ ఇస్తారేమో.. అప్పుడు ఏకంగా చంద్రుడిపైకే వెళ్లొచ్చు."
మరో ట్వీట్‌లో.. "2028 నాటికి మోదీ గుజరాత్‌లోని ప్రతి పౌరుడికీ చంద్రుడిపై ఓ ఇల్లు కూడా నిర్మించి ఇస్తారేమో. అంతే కాదు.. 2030 నాటికి ఏకంగా చంద్రుణ్నే భూమిపైకి తీసుకువస్తారు."

ఫొటో సోర్స్, Twitter
రాహుల్ ట్వీట్లపై సోషల్ మీడియాలో కామెంట్లు సైతం వైరల్‌గా మారాయి. "రాహుల్ ఇలాంటి ప్రసంగాలు 2014 ఎన్నికల సమయంలో ఇచ్చి ఉంటే భారత్‌ని మోదీ బారినుంచి కాపాడి ఉండేవారేమో" అని ఒకరంటే.. "మీకు 2030 వరకూ అధికారం రాదని నిశ్చయించుకున్నారన్నమాట, సంతోషం" అని మరొకరు స్పందించారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)




