'పకోడీ తినేసే లోగా మాల్యా బెయిల్‌పై వచ్చేశాడు'

ఫొటో సోర్స్, Getty Images
వేల కోట్ల రుణాల ఎగవేతల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా బ్రిటన్లో అరెస్టవడం.. వెంటనే విడుదల కావడం మంగళవారం రాత్రి వైరల్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో మాల్యా అరెస్ట్ - బెయిల్‌పై చాలా జోకులు పేలాయి.
పలు కేసుల్లో నిందితుడైన మాల్యాను తమకు అప్పగించాలని చాలా కాలంగా యూకేను భారత్ కోరుతూ వస్తోంది. భారత్ విజ్ఞప్తి మేరకు ఒక కేసులో ఏప్రిల్‌లో ఆయన్ను యూకే అధికారులు అరెస్ట్ చేశారు. అయితే వెస్ట్‌మిన్‌స్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో మాల్యాకు బెయిల్ లభించింది.
61 ఏళ్ల మాల్యా మంగళవారం మరో కేసులో అరెస్టై మళ్లీ వెంటనే విడుదలయ్యారు. ఈ సందర్భంగా ట్విటర్, ఫేస్‌బుక్‌లో సరదా కామెంట్లు, పోస్ట్‌లు, ట్వీట్లు పోటెత్తాయి.

ఫొటో సోర్స్, TWITTER
ఐ లవ్ ఎండీ అనే ట్విటర్ యూజర్.. కాంతికన్నా వేగవంతమైంది మాల్యా బెయిల్ మాత్రమే అంటూ ట్వీట్ చేశారు. ఇక కిరణ్‌కుమారి అయితే.. విజయ మాల్యా బెయిల్.. ‘‘మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్స్. రీడ్ ఆల్ స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కేర్‌ఫుల్లీ’’ కన్నా వేగవంతమైంది.. అంటూ ట్వీటారు.
మరోవైపు మాల్యా అరెస్ట్ వార్త విని కొందరు సీరియస్‌గా స్పందించారు. అయితే వెంటనే బెయిల్ రావడంతో సీరియస్ ట్వీట్ల కన్నా సెటైర్లే ఎక్కువగా కనిపించాయి.
ఇది కూడా చదవండి:
ఒక ట్విటర్ యూజర్.. ‘‘మాల్యా.. నేను పకోడీకి ఆర్డరిచ్చినపుడు నువ్వు అరెస్ట్ అయినట్లు వార్త వచ్చింది కానీ పకోడీ తిని మూతి తుడుచుకొనేలోపు నీకు బెయిల్ వచ్చేసింది.’’ అని ట్వీట్ చేశాడు.
ఇక కార్తీక్ అనే ట్విటర్ యూజర్ ఫాస్ట్, ఫాస్టర్, విజయ్ మాల్యా బెయిల్ అని అది ఎంతవేగవంతమైందో ట్వీట్ చేశారు. అజయ్ కూడా అంతే.. బోల్ట్ కన్నా మాల్యా బెయిల్‌కి వేగమెక్కువ అంటూ కామెంట్ చేశారు.
జునాయిద్ హక్కీ అనే హ్యాండిల్ నుంచి ‘‘లండన్‌లో మాల్యా అరెస్టయిన వెంటనే ఆ క్రెడిట్ కొట్టేసేందుకు మోదీ ట్వీట్ చేయాలనుకున్నారు. కానీ ఆయన ట్విటర్ హ్యాండిల్ ఓపెన్ చేసే సరికి మాల్యాకు బెయిల్ వచ్చేసింది.’’ అని రాశారు.

ఫొటో సోర్స్, TWITTER
లాల్‌ఎంలాల్ .. ‘ఉదయం.. హనీ ప్రీత్ అరెస్ట్.. సాయంత్రం మనీ ప్రీత్ అరెస్ట్’ అని పేర్కొంటే బ్లాక్‌బస్టర్ స్పైడర్.. హహ్హహ్హ విజయ మాల్యా అక్కడ అంటూ ట్వీట్ చేశారు.
ఇట్స్ నేహ అనే మరో నెటిజన్ ‘విజయ మాల్యా అరెస్టయినప్పుడు టీ తాగుతున్నాను.. కప్పు ఖాళీ అయ్యే లోపు బెయిల్ వచ్చేసింది’ అంటూ చమత్కరించారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








