హై స్పీడు రైలుకి వేలాడుతూ 25 కి.మీ. ప్రయాణం

ఫొటో సోర్స్, Getty Images
జర్మనీలో దాదాపు 160కి.మీ వేగంతో వెళ్లే రైలుకి ఓ పక్క వేలాడుతూ ప్రయాణించిన ఓ వ్యక్తి అదృష్టవశాత్తూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు.
రైలు డోర్ పక్కనున్న చిన్న స్టాండ్ మీద నిలబడి, అద్దం మీద ఉన్న ప్లాస్టిక్ హ్యాండిళ్లని జాగ్రత్తగా పట్టుకొని కదలకుండా నిలబడినట్టు డచ్ బాన్ అనే వ్యక్తి తెలిపారు.
బాన్ ప్రయాణించాల్సిన బెల్‌ఫెల్డ్ ఎక్స్‌ప్రెస్‌లో ముందు తన సామాన్లు పెట్టి కిందకి దిగాడు. ఈలోగా రైలు కదలడంతో ఏం చేయాలో పాలుపోక రైలు అద్దానికున్న చిన్న హ్యాండిళ్లని పట్టుకొని అలానే ఉండిపోయాడు.
విషయం తెలుసుకున్న అధికారులు డ్రైవర్‌కి సమాచారం ఇవ్వడంతో, పాతిక కిలోమీటర్ల అవతల ఉన్న స్టేషన్లో రైలుని ఆపారు.
‘ఆ వ్యక్తి ఇంకా బతికున్నందుకు రైల్వే అధికారులకు అతడు థ్యాంక్స్ చెప్పాల్సిందే’ అంటూ ఓ పోలీస్ అధికారి అన్నారు.
చిన్న గాయం కూడా లేకుండా బయటపడ్డ ఆ వ్యక్తిని రొమేనియాకి చెందినవాడిగా భావిస్తున్నారు. రైలు దిగిన వెంటనే అదే రైలు లోపలికి వెళ్లి బాన్ తన ప్రయాణాన్ని కొనసాగించారు.
విదేశాల్లో ఇలాంటి ప్రమాదకర ప్రయాణాలు కొత్తేం కాదు. ఆస్ట్రేలియాలో కూడా ఓ వ్యక్తి ఇటీవలే ఇలానే అద్దానికి వేలాడుతూ ప్రయాణిస్తూ కెమెరాకి చిక్కాడు. మెక్సికోలో అయితే ‘ది బీస్ట్’ అనే రైలు బోగీలపైన నిత్యం చాలామంది శరణార్థులు ప్రమాదకరంగా ప్రయాణిస్తూ కనిపిస్తారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)









