అఫ్గానిస్తాన్: భూకంపం మిగిల్చిన విషాదం, 9 ఫోటోలలో..

ఫొటో సోర్స్, Getty Images
అఫ్గానిస్తాన్‌లో ఆదివారం రాత్రి వచ్చిన భూకంపంతో అధిక ప్రాణ నష్టం సంభవించింది.
భూకంపం కారణంగా దాదాపు 800 మంది చనిపోయినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. మరో 1800 మంది గాయపడ్డారు.
తూర్పు అఫ్గానిస్తాన్‌లోని మారుమూల ప్రాంతాల్లో శిథిలాల కింద చిక్కుకుపోయిన బాధితుల కోసం హెలికాప్టర్లలో గాలిస్తున్నారు.
6.0 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా కూలిన ఇళ్ల శిథిలాల కింద చాలామంది చిక్కుకుపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.

రోడ్లన్నీ శిథిలాలతో మూసుకుపోవడంతో, పర్వత ప్రాంతాలకు వెళ్లే మార్గాలు కఠినంగా మారాయి, దీంతో మంగళవారం కూడా అధికారులు హెలికాప్టర్ల ద్వారా సహాయక కార్యక్రమాలు చేపట్టారు.
అంతర్జాతీయ సహాయం కోసం తాలిబాన్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
ఐక్యరాజ్య సమితి అత్యవసర నిధులను విడుదల చేయగా, 1 మిలియన్ పౌండ్లు (రూ. 11.79 కోట్లు) ఇస్తామని యూకే హామీ ఇచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














