రెండు దేశాల్లో కరెంట్ పోయింది.. ప్రజల కష్టాలు 11 ఫొటోలలో

విద్యుత్ అంతరాయం

ఫొటో సోర్స్, EPA

స్పెయిన్‌లోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రభావం విమానాశ్రయాలు, రైళ్లు, పెట్రోల్ బంకులపై పడింది. స్పెయిన్‌లో అత్యవసర పరిస్థితి కూడా విధించారు. అయితే, చివరకు విద్యుత్‌ను పునరుద్ధరించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ఇటు పోర్చుగల్‌‌లో కూడా అదే పరిస్థితి. కొన్ని షాపులు, సూపర్ మార్కెట్లు కూడా మూసివేశారు. కార్డు పేమెంట్లు ఆగిపోవడంతో స్థానిక కిరాణా దుకాణాల్లో నగదు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఎందుకు ఏర్పడిందో తెలియని ఈ విద్యుత్ సంక్షోభం వల్ల ఒక రోజంతా ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారో చెప్పే 11 ఫోటోలు...

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
టెన్నిస్

ఫొటో సోర్స్, Reuter

ఫొటో క్యాప్షన్, ఆటంకం కారణంగా మాడ్రిడ్ ఓపెన్‌లో ఆ రోజు ఆటను నిలిపివేయాల్సి వచ్చింది.
సూపర్ మార్కెట్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సూపర్ మార్కెట్ల తలుపులు ఎయిర్ కండిషనింగ్ విద్యుత్తుతో నడుస్తున్నందున వాటిని మూసివేశారు.
ఏటీఎమ్‌

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, లిస్బన్‌లో కార్డు చెల్లింపులు ఆగిపోవడంతో, ప్రజలు ఏటీఎమ్‌ల వద్ద క్యూ కట్టారు.
అండర్ గ్రౌండ్ పార్కింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్పెయిన్‌, విగోలోని అండర్ గ్రౌండ్ పార్కింగ్ వంటి ప్రదేశాలను తెరవడం కూడా కష్టమైంది.
గ్యాస్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, విద్యుత్తు అంతరాయం సమయంలో ప్రజలు విద్యుత్తుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించడానికి గ్యాస్ కొనుగోలు చేశారు.
రైలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, స్పెయిన్ జాతీయ రైలు సంస్థ రెంఫే ప్రయాణీకులపై తీవ్ర ప్రభావం పడింది.
ట్రాఫిక్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, మాడ్రిడ్‌లో రైళ్లు నడవకపోవడంతో ప్రయాణికులంతా బస్సుల్లో ఎక్కడానికి ప్రయత్నించారు. దీంతో బస్సులు కిక్కిరిసిపోయాయి.
ప్రయాణికులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సోమవారం నుంచి మీడియం లేదా లాంగ్ డిస్టెన్స్ రైళ్లు సాధారణ సర్వీసులను తిరిగి ప్రారంభించే అవకాశం లేదని స్పెయిన్ రవాణా మంత్రి అన్నారు.
వాహనాలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ట్రాఫిక్ లైట్లు దెబ్బతినడంతో, మాడ్రిడ్ సహా పెద్ద నగరాల్లో వాహనాలు, పాదచారులు రోడ్లపై నావిగేట్ చేయడానికి ప్రయత్నించడంతో గందరగోళ దృశ్యాలు కనిపించాయి.
ట్రాఫిక్ జామ్‌

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ప్రజా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం, భారీ ట్రాఫిక్ జామ్‌లు ఉన్నప్పటికీ, కొంతమంది స్పానిష్ రాజధాని నుంచి ఇంటికి ప్రయాణించడానికి ప్రయత్నిస్తూ కనిపించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)