వరల్డ్ బ్లడ్ డోనర్ డే: బ్లడ్ గ్రూప్స్ ఎన్ని, వాటిలో అరుదైనవి ఏవి?

వీడియో క్యాప్షన్, వరల్డ్ బ్లడ్ డోనర్ డే: అరుదైన బ్లడ్ గ్రూప్స్ ఏమిటి?
వరల్డ్ బ్లడ్ డోనర్ డే: బ్లడ్ గ్రూప్స్ ఎన్ని, వాటిలో అరుదైనవి ఏవి?

సాధారణంగా మనిషి రక్తం A, B, AB, O గ్రూపులుగా ఉంటుంది. ఎర్ర రక్త కణాలపై ఉండే యాంటిజన్ల ఆధారంగా ఈ గ్రూపులను నిర్ణయిస్తారు. A- యాంటిజన్ ఉంటే A గ్రూపు, B-యాంటిజన్ ఉంటే B గ్రూపు, రెండూ ఉంటే AB గ్రూపు, అవేవీ లేకపోతే O గ్రూపుగా పరిగణిస్తారు.

అలాగే ఎర్ర రక్త కణాలపై RH ప్యాక్టర్ ఉంటే పాజిటివ్‌గా లేకపోతే నెగిటివ్‌గా భావిస్తారు. అంటే ఎర్ర రక్త కణాలపై యాంటిజన్‌తో పాటు RH ఫ్యాక్టర్ కూడా ఉంటే అది పాజిటివ్, లేకపోతే అది నెగిటివ్ అంటారు.

వరల్డ్ పాపులేషన్ రివ్యూ వెబ్ సైట్ అందించిన వివరాల ప్రకారం, మన దేశంలో A పాజిటివ్ బ్లడ్ 21.8%, A నెగిటివ్ బ్లడ్ 1.36%, B పాజిటివ్ బ్లడ్ 32.1%, B నెగిటివ్ బ్లడ్ 2% AB పాజిటివ్ బ్లడ్ 7.7%, AB నెగిటివ్ బ్లడ్ 0.48%, O పాజిటివ్ 32.53%, O నెగిటివ్ బ్లడ్ 2% మందిలో ఉంది.

AB పాజిటివ్, AB నెగిటివ్, O నెగిటివ్ బ్లడ్ గ్రూపులతో పాటు మరో రెండు అత్యంత అరుదైన గ్రూపులు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి బాంబే బ్లడ్ గ్రూపు కాగా, రెండోది గోల్డెన్ బ్లడ్ గ్రూపు.

వరల్డ్ బ్లడ్ డోనర్ డే

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)