జో బైడెన్‌ను వైట్‌హౌజ్‌లో కలిసిన డోనల్డ్ ట్రంప్

జో బైడెన్, ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డోనల్డ్ ట్రంప్, అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్న జో బైడెన్‌ను వైట్‌ హౌజ్‌లో కలిశారు.

‘శాంతియుతంగా అధికార బదిలీ’ జరిగేందుకు తాను కట్టుబడి ఉన్నానంటూ డోనల్డ్ ట్రంప్‌ను జో బైడెన్ ఆహ్వానించారు. దాంతో, ట్రంప్ ఫ్లోరిడాలోని తన నివాసం నుంచి తన ప్రైవేటు విమానంలో వాషింగ్టన్ డీసీకి వెళ్లారు.

ప్రభుత్వం చేతులు మారే క్రమంలో అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయేవారు, కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోయే వారు ఇలా కలవడం అమెరికాలో ఆనవాయితీగా వస్తోంది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జో బైడెన్, ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

అంతకుముందు తన కార్యవర్గంలో కీలక నియామకాలకు సంబంధించి వరుస ప్రకటనలు చేశారు ట్రంప్.

టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్‌తో పాటు భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామిని ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(డీఓజీఈ)’ అధిపతులుగా నియమించారు.

ఫాక్స్ న్యూస్ హోస్ట్, మాజీ సైనికాధికారి పీటే హెగ్‌సేథ్‌ను రక్షణ మంత్రిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.

ఫ్లోరిడాకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు మైక్ వాల్జ్‌ను జాతీయ భద్రతా సలహాదారుగా, మార్కో రూబియోను విదేశాంగ శాఖ మంత్రిగా నియమించారు.

జో బైడెన్

ఫొటో సోర్స్, Reuters

జో బైడెన్, ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)