ఐదేళ్ల క్రితం కరోనా వల్ల ఆర్థికంగా, ఆరోగ్యంగా దెబ్బ తిన్న కుటుంబం ఇప్పుడెలా ఉంది?
ఐదేళ్ల కిందట కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. దాని కారణంగా ప్రపంచవ్యాప్తంగా భారీగా ప్రాణనష్టంతో పాటు అనేక కుటుంబాల ఆర్థిక, ఆరోగ్య మూలాలు దెబ్బతిన్నాయి.
అలా తీవ్రంగా కుదేలైన కుటుంబాల్లో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం భావుపేటకు చెందిన కొట్టేపల్లి గంగరాజు కుటుంబం ఒకటి.
వీరి ఇంట్లో అప్పుడు వరుసగా ముగ్గురు కోవిడ్ బారిన పడ్డారు.
ఆ సమయంలో తమకు ఆర్థికంగా, మానసికంగా ఎదురైన అనుభవాలను గంగారాజు, శ్యామల దంపతులు వివరించారు.
కోవిడ్ చికిత్స కోసం ఈ కుటుంబం తమకున్న 20 గుంటల భూమిని అమ్మేసింది. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత గంగారాజు కుటుంబం తరచూ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ఆ జ్ఞాపకాలను ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నామని ఈ కుటుంబం చెబుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









