తాలిబన్ల పాలనలో మహిళలపై పెరుగుతున్న ఆంక్షలు
తాలిబన్ల పాలనలో మహిళలపై పెరుగుతున్న ఆంక్షలు
అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం మహిళలపై ఆంక్షల్ని రోజురోజుకూ పెంచుతోంది.
గత నెలలో మహిళలను పార్కులు, జిమ్‌లు, స్విమింగ్ పూల్స్‌కు వెళ్లొద్దంటూ నిషేధం పెట్టారు.
దేశంలో చాలా చోట్ల సెకండరీ స్కూల్స్ నుంచి బాలికలను ఇదివరకే నిషేధించారు.
కొన్ని రంగాల్లో మహిళలు పని చేయకుండా బ్యాన్ చేశారు.
ఇంకా ఎలాంటి నిషేధాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న భయం తమను వెంటాడుతోందని మహిళలు, బాలికలు బీబీసీతో చెప్పారు.
కాబుల్ నుంచి యోగితా లిమయే అందిస్తున్న రిపోర్ట్.










