ఫ్లాష్ ఫ్లడ్స్: ప్రకృతి విలయం పుట్టిన క్షణాలు.. 5 చిత్రాలలో

ఫొటో సోర్స్, ANI
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశిలో మంగళవారం ఫ్లాష్ ఫ్లడ్స్ (మేఘాల విస్ఫోటం) ఏర్పడి, హర్షిల్ ప్రాంతంలోని ఖీర్ గంగా గడేరా (లోతైన గుంట లేదా కాలువ) నీటి మట్టం పెరగడంతో అక్కడి ధరాలి గ్రామాన్ని వరద ముంచెత్తింది.

ఫొటో సోర్స్, ANI
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, అక్కడ నలుగురు మరణించారని, కొంత ఆస్తి నష్టం కూడా జరిగిందని ఉత్తరకాశి కలెక్టర్ ప్రశాంత్ ఆర్య తెలిపారు.

ఫొటో సోర్స్, X/@UttarkashiPol
ఈ సంఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్లు, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, ANI
"ఫ్లాష్ ఫ్లడ్స్ అయినట్లు రిపోర్టు అందింది. నీటితో పాటు శిథిలాలు చాలా వేగంగా వచ్చాయి. వీలైనంత త్వరగా సహాయ, రక్షణ చర్యలు చేపట్టడానికి ప్రయత్నిస్తున్నాం. జిల్లా యంత్రాంగం అక్కడికి చేరుకుంటోంది’’ అని ఏఎన్ఐ వార్తాసంస్థతో ముఖ్యమంత్రి ధామి చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
"చాలా హోటళ్లు కొట్టుకుపోవడం నా ఇంటి పైకప్పు నుంచి చూశాను. మా ఊరు మార్కెట్ మొత్తం ధ్వంసమైంది" అని ధరాలి గ్రామంలో నివసించే ఆస్తా బీబీసీతో చెప్పారు.
ఎలాంటి హెచ్చరిక జారీ చేయలేదని, సంఘటన జరిగిన సమయంలో గ్రామస్థులు పూజకు వెళ్తున్నారని ఆస్తా చెప్పారు.
వరదల తాకిడికి చాలామంది తప్పిపోయారని, గ్రామస్థులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆస్తా చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














