ఫిలిప్పీన్స్: కన్నబిడ్డలను రేప్ చేస్తూ వీడియో తీస్తున్న తల్లిదండ్రులు...డబ్బు కోసం దిగ్భ్రాంతిపరిచే దుర్మార్గాలు
ఫిలిప్పీన్స్‌లో చిన్నారులపై లైంగిక దోపిడీ కేసులు పెరిగిపోతున్నాయి. కొన్ని ఉదంతాల్లో తల్లిదండ్రుల కారణంగానే బాలలు బాధితులుగా మారుతున్నారు.
ఓ అబ్బాయిని, అతడి ఇద్దరు అక్కాచెల్లెళ్లను కెమెరా ముందు లైవ్ సెక్స్ చేయాలంటూ వారి కన్నతల్లే ఒత్తిడి చేసిన ఉదంతం ఇది.
స్మశానంలో ఉన్న ఒక ఇంట్లో ఈ పిల్లలను వారి తల్లిదండ్రులే ఉంచారు. ఆ పిల్లలను సామాజిక కార్యకర్తలు రక్షించారు.
‘‘సుదీర్ఘ కోవిడ్ లాక్‌డౌన్ కాలంలో డబ్బుకు ఇబ్బందై వారు (ఆ పిల్లల తల్లిదండ్రులు) అలా చేశారు’’ అని పోలీసులు చెప్తున్నారు.
చిన్నారులపై అత్యాచారాలకు ఒడిగట్టే ఒక ఆస్ట్రేలియా వ్యక్తి.. ఈ పిల్లలను సెక్స్ వ్యాపారంలోకి దింపేందుకు వారి తల్లికి 20 డాలర్లు చెల్లించాడని తెలుస్తోంది.

పోలీసులు.. సెక్స్ టాయ్స్, స్మార్ట్ ఫోన్స్ వంటి ఆధారాలను సేకరించారు.
విపరీతంగా పెరుగుతున్న ఇలాంటి కేసులను డీల్ చేయడం పోలీసులకు కూడా కష్టంగా మారింది.
ఇలాంటి అకృత్యాలకు గురైన చిన్నారులకు చిల్డ్రన్స్ హోంలో సాయం అందిస్తున్నారు. పిల్లలకు సిండరెల్లా కథ చెబుతున్నారు.
పదేళ్ల మారియా మాతో మాట్లాడింది. ఎన్నో కష్టాల్లోనూ ఆమె ఆశ వీడలేదు. ‘‘మా తల్లిదండ్రులే మాపై దారుణానికి ఒడిగట్టారు. అయినా ఆమెను అనుసరించాల్సిందే’ అంది.
మారియాను, ఆమె సోదరులు జాన్, ఎరిక్‌లను.. వారి తల్లి, ఆంటీ, అంకుల్‌లు రేప్ చేసి వీడియోలు తయారు చేశారు.
ఇలా చేసినందుకు వారికి బ్రిటన్, యూరప్ అకౌంట్ల నుంచి డబ్బు అందింది.
ప్రస్తుతం ఆ ముగ్గురు చిన్నారులు క్షేమంగానే ఉన్నారు. ఏడేళ్ల ఎరిక్ ఇప్పుడు పాటలు పాడటం అంటే ఇష్టపడుతున్నాడు.

‘వారికి పూట గడవటానికి ఇదొక్కటే దారిగా కనిపించింది’
అయితే, తమపై జరిగిన దుర్మార్గానికి వీరు మానసికంగా చాలా మూల్యం చెల్లించారు.
వినడానికి కష్టంగా అనిపిస్తుంది.
‘‘నా మీదే ఎందుకిది జరిగింది?.. మీ రక్తమాంసాలను పంచి ఇచ్చిన నా మీదే ఎందుకిలా?’’ అనేది ఇక్కడి వారందరినీ వేధించే ప్రశ్న.
‘‘కరోనా మహమ్మారి వల్ల బాలలపై లైంగిక దోపిడీ, అఘాయిత్యాలు పెరిగాయి. ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోవడంతో కుటుంబానికి పూట గడవాలంటే, ఇదొక్కటే మార్గమని వారు భావించారు. ఇందులో చేయ్యాల్సిందేమీ ఉండదని, సులువైన పని అనీ ఈ కుటుంబాలు వారి పిల్లలను ఒప్పించాయి. ‘వీడియో ముందు నగ్నంగా నిలబడితే చాలు ఎంతో కొంత డబ్బు వస్తుంది’ అని ఒత్తిడి చేశారు’’ అని ‘ప్రీడా ఫౌండేషన్’ ప్రోగ్రాం మేనేజర్ ఫెడలీన్ మేరీ బాల్డో పేర్కొన్నారు.
ఇంత జరిగినప్పటికీ ఈ పిల్లల్లో ఆశలున్నాయి. మానసికంగా దృఢంగా ఉండటం, దేన్నైనా ఎదుర్కోవడం ఎలాగనేది వీరికి నేర్పిస్తున్నారు. వీళ్లు తిరిగి తమ బాల్యాన్ని ఆస్వాదించేలా ఆడుకోవటాన్ని ప్రోత్సహిస్తున్నారు.

చిన్నారులపై లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా దశాబ్దాలుగా పోరాడుతూ వచ్చిన వారికి ఇప్పుడు మరింత పెద్ద పోరాటం ఇది.
‘‘దీనిని అంతం చేయాలంటే అంతర్జాతీయ చట్టం తేవడం ఒక్కటే మార్గం. అన్ని దేశాల ప్రభుత్వాలు, ఐక్యరాజ్యసమితి ఇందులో భాగం కావాలి. పిల్లలపై లైంగిక అఘాయిత్యాలకు సంబంధించిన దృశ్యాలేవీ ప్రసారం కాకుండా, ఆన్‌లైన్ స్ట్రీమింగ్ కాకుండా కఠిన నియంత్రణలు తేవడానికి అందరూ పరస్పర సహకారంతో పనిచేయాలి’’ అని ప్రీడా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఫాదర్ షాయ్ కలెన్ చెప్పారు.
ఓ ఇంట్లో ఒకరిని అరెస్టు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దుండగులను గుర్తించేందుకు ఇక్కడి అధికారులకు అంతర్జాతీయ సహాయం అందుతోంది.
ఇవి కూడా చదవండి:
- ‘నా భార్య నగ్న ఫోటోలు అప్పులోళ్ల దగ్గరకు ఎలా వెళ్లాయి’
- సెక్స్ సరోగేట్స్: గాయపడిన సైనికులకు వారు ఎలా సాయం చేస్తున్నారు... దీనిపై అభ్యంతరాలు ఎందుకు?
- లచిత్ బార్పుకన్: అర్ధరాత్రి దెయ్యాల్లా మొఘల్ సైన్యం మీదకు విరుచుకుపడిన అహోం యోధుల సాహస గాథ
- కాంతారా: అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా మీద అసంతృప్తి ఎందుకు
- విప్ప సారా: బ్రిటిషర్లు నిషేధించిన ఈ భారతీయ మద్యం అంతర్జాతీయంగా ఆదరణ పొందగలదా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















