‘ప్రకాశ్ రాజ్ కుంభమేళా చిత్రం’ సోషల్ మీడియాలో వైరల్.. కేసు పెడతానంటూ నటుడి హెచ్చరిక

ఫొటో సోర్స్, Getty Images
కుంభమేళాలో నటుడు ప్రకాశ్ రాజ్ 'పుణ్య స్నానం' చేసినట్లు ఓ ఫోటో వైరల్ అయింది. అయితే, ఆ ఫొటో ఫేక్ అని.. ఇలా తప్పుడు సమాచారం వ్యాప్తి చేసేవారిపై కేసు నమోదు చేస్తానని ప్రకాశ్ రాజ్ హెచ్చరించారు.
మహాకుంభమేళాలో త్రివేణి సంగమంలో ప్రకాశ్ రాజ్ స్నానం చేస్తున్నట్లు ఓ ఫోటోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రూపొందించారు.
దీనిని ప్రశాంత్ సంబర్గి అనే యూజర్ ఎక్స్‌లో 'అతని పాపాలన్నీ తొలగిపోతాయని ఆశిస్తున్నాను' అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు.
మరో ఎక్స్ యూజర్ 'దేవుడినే నమ్మని ప్రకాశ్ రాజ్ కుంభమేళాకు వెళ్లారు' అంటూ పోస్ట్ పెట్టారు. ఈ ఏఐ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చాలామంది ఈ చిత్రం ఏఐతో రూపొందించింది అంటూ సులభంగానే గుర్తు పట్టారు.
‘ఎక్స్’ కమ్యూనిటీ నోట్ కూడా ఈ ఫొటో ఫేక్ అని ఆ పోస్ట్ కిందే నోట్ పెట్టింది.

ప్రకాశ్ రాజ్ ఏమన్నారు?
ఈ ఫోటో ప్రకాశ్ రాజ్ దృష్టికి రావడంతో ఆయన స్పందించారు.
అది నకిలీ వార్త అని ఎక్స్ వేదికగా స్పష్టంచేశారు. ఇలా చేయడం సిగ్గుచేటన్నారు. దీనిపై ఫిర్యాదు చేసినట్లు ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.
‘ఫేకు మహారాజ్ ఫాలోవర్లు కొంతమంది తమ మతపరమైన కార్యక్రమాల సమయంలో కూడా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇది సిగ్గుచేటు, వారిపై ఫిర్యాదు చేశా. పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది'' అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అయితే, ఒక్క ప్రకాశ్ రాజ్‌కు సంబంధించిన ఏఐ చిత్రాలు కూడా కుంభమేళా సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి.
డోనల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్, జాన్ సీనా, షారుక్ ఖాన్, రోండా రౌసీ వంటి చాలామంది నేషనల్, ఇంటర్నేషనల్ సెలబ్రెటీల ఫొటోలను కొందరు ఏఐ సహాయంతో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దాంతో ఇలాంటి మీమ్స్ సాధారణమేనని, ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు వరకు వెళ్లడం అవసరం లేదంటూ కొందరు సోషల్ మీడియాలో తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














