మహా కుంభమేళాలో తొక్కిసలాట: అక్కడ ఎలా ఉందో ఈ 10 చిత్రాలలో చూడండి

ఫొటో సోర్స్, Getty Images
మహాకుంభమేళాలో బుధవారం తొక్కిసలాట జరిగింది.
భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు చెప్తున్నారు.
ఘటనలో 15 మంది మృతిచెందినట్లు ప్రయాగ్ రాజ్ వైద్యుడొకరు ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో తెలిపారు.
అయితే, అధికారికంగా దీనిపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
స్నానాలు చేయడానికి వచ్చిన భక్తులు అధికారుల సూచనలు పాటించాలని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోరారు.
‘మీరున్న చోటికి సమీపంలో ఉండే ఘాట్లలో స్నానాలు చేయండి. అందరూ నదీ సంగమం వద్దకే వెళ్లేందుకు ప్రయత్నించొద్దు’ అని ఆయన భక్తులను కోరారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో మౌని అమావాస్య రోజున స్నానాలు చేయడానికి 10 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
పెద్ద సంఖ్యలో చేరుకున్న భక్తులు బారికేడ్లు దాటే ప్రయత్నం చేయడం సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోలు, ఫొటోలలో కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
తొక్కిసలాట విషయం తెలియగానే స్థానిక పోలీసులు, భద్రత సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కొందరు భక్తులు తమ కుటుంబ సభ్యులు కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించారు.

ఫొటో సోర్స్, Getty Images
తొక్కిసలాట జరిగిన ప్రదేశంలో భక్తులకు సంబంధించిన దుస్తులు, బ్యాగులు, చెప్పులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని అక్కడి నుంచి రిపోర్ట్ చేస్తున్న బీబీసీ ప్రతినిధి సమీర హుస్సేన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
తొక్కిసలాట చోటుచేసుకున్న ప్రాంతంలో కూర్చున్న భక్తుడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














