బార్బీ డాల్: ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం ఈ బొమ్మలపై కూడా పడుతుందా

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, జావో డ సిల్వా
- హోదా, బీబీసీ ప్రతినిధి
డోనల్డ్ ట్రంప్ విధించిన సుంకాల ప్రభావాన్ని తట్టుకోవడానికి అమెరికాలో తమ ఉత్పత్తుల ధరలు పెంచవచ్చని బొమ్మల తయారీ దిగ్గజం మాటెల్ తెలిపింది.
చైనా ఉత్పత్తులపై 10 శాతం సుంకాలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన తరువాత బార్బీ, హాట్‌వీల్స్ బొమ్మల తయారీ సంస్థ మాటెల్ ఈ ప్రకటన చేసింది.
ఈ సంస్థ ఉత్పత్తుల్లో 40 శాతంలోపు ప్రొడక్షన్ చైనా కేంద్రంగా సాగుతున్నాయి.
అమెరికా సుంకాల నేపథ్యంలో తమ సప్లై చైన్‌లో మార్పులు చేసుకుంటామని మాటెల్ తెలిపింది.

సుంకాలవల్ల సప్లై చైన్‌లో తేడాలు వచ్చి ధరలు పెరిగే ప్రమాదం ఉందని అమెరికాలోని వ్యాపారవర్గాలు, వినియోగదారులు హెచ్చరిస్తున్నారు.
అమెరికా విధించిన సుంకాల ప్రభావం గురించి మాటెల్ త్రైమాసిక నివేదిక చర్చించింది. సరఫరా గొలుసులో సర్దుబాట్లు, ధరల పెరుగుదల సహా ఆ ప్రభావాన్ని తగ్గించడానికి కంపెనీ చర్యలు తీసుకుంటుందని ఫిబ్రవరి 1న వెల్లడించింది
బొమ్మల పరిశ్రమ 2024లో విక్రయాలలో మందగమనాన్ని ఎదుర్కొంది. అమెరికాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం వల్ల ప్రజలు బొమ్మలపై వెచ్చించే నగదు తగ్గింది.
మరోపక్క వాల్‌స్ట్రీట్ విశ్లేషకులు అంచనా వేసిన దానికంటే వచ్చే ఏడాది మెరుగైన లాభాలు నమోదు చేస్తామని మాటెల్ అంచనా వేయడంతో, ఆ కంపెనీ షేర్ల ధరలు 10శాతం పెరిగాయి.
ట్రంప్ విధించే సుంకాలవల్ల అమెరికాలో ధరలు పెరుగుతాయని, సరఫరా గొలుసులో తేడాలు వస్తాయని యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ అంతర్జాతీయ హెడ్ జాన్ మర్ఫీ చెప్పారు.
అయితే కెనడా, మెక్సికోలపై విధించిన సుంకాలను ట్రంప్ నిలిపివేశారు. కానీ చైనాపై విధించిన సుంకాల విషయంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














