సంప్రదాయాలను ధిక్కరిస్తూ సముద్రంలో చేపల వేటకు వెళ్తున్న కెన్యా మహిళ
కెన్యాలో చేపల వేట కోసం మహిళలు సముద్రం లోపలికి వెళ్తే అది అరిష్టం అనే నమ్మకం ఉంది. ఇది అనాదిగా కొనసాగుతూ వస్తున్న మూఢ నమ్మకం.
దీన్ని సవాలు చేస్తూ డీప్ సీ ఫిషింగ్ చేస్తున్నారు 28 ఏళ్ల పౌలీన్ ఎమ్వాకా.
మత్స్యకార సముదాయంలో మహిళల పట్ల కొనసాగుతున్న ఈ వివక్షను తొలగించాలని ఆమె ప్రయత్నిస్తున్నారు. బీబీసీ ప్రతినిధి అహ్మద్ బహాజ్ అందిస్తున్న కథనం పైన వీడియోలో చూద్దాం..


(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











