ఈ రైల్వేస్టేషన్‌లో 'టీ స్టాల్' చాలా స్పెషల్

వీడియో క్యాప్షన్, ఈ రైల్వేస్టేషన్‌లో 'టీ స్టాల్' చాలా స్పెషల్
ఈ రైల్వేస్టేషన్‌లో 'టీ స్టాల్' చాలా స్పెషల్

అస్సాంలోని గుహవాటి రైల్వేస్టేషన్‌లో రాణి టీ స్టాల్ పెట్టుకున్నారు. గత కొన్ని రోజులుగా విశ్రాంతి లేకుండా ఈ టీ స్టాల్‌లో పనిచేస్తున్నారు ఆమె. ఇంతకీ ఈ టీ స్టాల్ ఎందుకంత ప్రత్యేకం? ఎవరు ఈ రాణి?

ట్రాన్స్‌జెండర్ టీ స్టాల్

రాణి ఓ ట్రాన్స్‌జెండర్. షాపు నడుపుతూ తన కాళ్ల మీద నిలబడుతోంది. ట్రాన్స్‌జెండర్లు అంటే భిక్షాటన, సెక్స్ వర్క్ తప్ప మరొకటి చేయరన్న విమర్శలు ఉన్నాయి.

కానీ రాణి అందుకు భిన్నంగా అడుగులేశారు. దానికి అధికారులూ చేయూత అందించారు. ఆల్ అస్సాం ట్రాన్స్ జెండర్ అసోసియేషన్ ఈ టీ స్టాల్ బాధ్యతలను రాణికి అప్పగించింది. దీనిపై బీబీసీ ప్రత్యేక కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)