హైదరాబాద్‌లో యువతి కిడ్నాప్, అనుచరులతో వచ్చి యువకుడి బీభత్సం

వీడియో క్యాప్షన్, సంఘటనను వివరిస్తున్న యువతి కుటుంబ సభ్యులు
హైదరాబాద్‌లో యువతి కిడ్నాప్, అనుచరులతో వచ్చి యువకుడి బీభత్సం

హైదరాబాద్ శివారులోని మన్నెగూడలో శుక్రవారం యువతి కిడ్నాప్ ఘటన సంచలనం సృష్టించింది. యువతి వివాహ నిశ్చితార్థం రోజున ఈ కిడ్నాప్ జరిగింది.

దాదాపు 100 మంది తమ ఇంట్లోకి చొరబడి 24 ఏళ్ల అమ్మాయిని బలవంతంగా ఎత్తుకెళ్లారని యువతి కుటుంబ సభ్యులు చెప్పారు.

అడ్డుకోబోయిన తమను దుండగులు కొట్టారని, తమ ఇంటిని ధ్వంసం చేశారని ఆరోపించారు.

ఆ యువతిని పోలీసులు రక్షించారు. 8 మందిని అరెస్టు చేశామని, ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డితో సహా మరికొందరు పరారీలో ఉన్నారని రాచకొండ అదనపు సీపీ సుధీర్ బాబు చెప్పారు.

హైదరాబాద్

ఫొటో సోర్స్, ANI

ఇవి కూడా చదవండి: