వైభవంగా శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు.. 14 ఫోటోల్లో..

    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
    • హోదా, బీబీసీ కోసం

తిరుమలలో నవరాత్రుల సందర్భంగా శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

సాధారణంగా తిరుమల బ్రహ్మోత్సవాలు ఏడాదికి ఒకసారే జరుగుతాయి. కానీ మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధికమాసంలో రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

ఈ ఏడాది సెప్టెంబరులో వెంకటేశ్వరస్వామికి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించిన టీటీడీ, ఇప్పుడు నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తోంది.

జీఎంసీ టోల్‌గేట్ నుంచి వైభవ మండపం వరకు ముఖ్యమైన కూడళ్లలో రంగురంగుల పువ్వుల మొక్కలను టీటీడీ ఏర్పాటు చేసింది.

దేవతా మూర్తుల ఆకారాలలో లైట్ సెట్టింగ్స్ జిగేల్ మనిపిస్తున్నాయి.

ప్రధాన ఆలయం చుట్టూ విద్యుత్ కాంతులతో ఏర్పాటు చేసిన లైటింగ్స్ అక్కడికి వచ్చే భక్తులను మైమరిపింపచేస్తున్నాయి.

బ్రహ్మోత్సవాలను ఈ ఫోటోల్లో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)