గుజరాత్ ఎన్నికలు: పాటిదార్ల ఓట్లే కీలకం

ఫొటో సోర్స్, Getty Images
గుజరాత్‌లో తుది విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 93 స్థానాల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 సీట్లు ఉన్నాయి.
తొలి విడత 89 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి.
అక్కడ 68శాతం ఓటింగ్ నమోదైంది.
ఇప్పుడు 14 జిల్లాల్లోని 93 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.


ఫొటో సోర్స్, Getty Images

గత ఎన్నికల్లో బీజేపీ 52 సీట్లను, కాంగ్రెస్ 39 సీట్లను గెలుచుకున్నాయి.
తొలి దశలో సౌరాష్ట్ర, సూరత్ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది.
దాంతో ఇవాళ్టి పోలింగ్ సరళిపై ఆసక్తి ఏర్పడింది.
పాటీదార్ల ఓట్లు పార్టీల గెలుపోటములను ప్రభావితం చేస్తాయని అంచనా వేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గుజరాత్‌లో 22 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తోంది.
నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా 14 ఏళ్లు పనిచేశారు. కానీ గత మూడేళ్లలో ఇద్దరు సీఎంలు మారారు.
కుల రాజకీయాలు ఎన్నికల సరళిపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత, జీఎస్టీపై ప్రజల అసంతృప్తి, ద్రవ్యోల్బణం పెరగడం వంటివి అధికార పార్టీని కలవర పెడుతున్నాయి.

రెండో విడత ఎన్నికలు హార్థిక్ పటేల్, జిగ్నేశ్ మెవానీ వంటి వారికి కీలకంగా మారాయి.
అహ్మదాబాద్‌లోని ఐదు స్థానాలు సహా మొత్తం 17 స్థానాల్లో పాటీదార్ అంశం కీలకం కాబోతోంది.
పాటిదార్ రిజర్వేషన్ల ఉద్యమానికి కేంద్ర బిందువైన మెహ్‌సనా జిల్లాలో ఓటింగ్ సరళిని ప్రజలు గమనిస్తున్నారు.
బీజేపీ అభివృద్ధి మంత్రంతో ప్రజల్లోకి వెళ్లింది.
2022లోగా రాష్ట్రంలో పేదరికం లేకుండా చేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.
విపక్ష కాంగ్రెస్ జీఎస్టీ, నిరుద్యోగం, నీరు, విద్యుత్, మహిళల రక్షణ, రైతు సమస్యలపై ఎన్నికల సమరంలో దూకింది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










