ఫ్రీగా వచ్చిందని పోర్న్ చూస్తున్నారు!

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వేణుగోపాల్ బొల్లంపల్లి
- హోదా, బీబీసీ ప్రతినిధి
టెలికం సంస్థలు పోటీ పడి మరీ ఉచితంగా లేదా తక్కువ ధరకు ఇంటర్నెట్ ఇస్తుండటంతో.. భారత్‌లో నెటిజన్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో అబ్బాయిలు, అమ్మాయిలన్న తేడా లేకుండా.. పోర్న్ వీడియోలు చూసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
కేవలం మహానగరాలలోనే కాకుండా చిన్న పట్టణాల్లోనూ పోర్న్ వీడియోలు చూడటం పెరుగుతోంది. ఈ వీడియోల ప్రభావానికి గురై పిల్లలు దారి తప్పుతుండటంతో.. తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
పిల్లలు పాడైపోతున్నారంటూ వారిని మానసిక నిపుణుల వద్దకు తీసుకెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది.
చివరకు భారత మహిళల్లో కూడా పోర్న్ చూడటం పెరుగుతోంది.

ఫొటో సోర్స్, Reuters
ఇటీవల వీడియో వీక్షకుల ట్రాకర్ విడూలీ అనే సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక వివరాలను ప్రముఖ జాతీయ పత్రికలన్నీ ప్రచురించాయి. ఆ వివరాల ప్రకారం ఏడాది తొలి మూడు నెలల్లోనే దేశంలో నెటిజన్లు 130 కోట్ల జీబీకి పైగా డేటాను వాడుకున్నారు. ఇది కిందటి ఏడాది జూన్‌తో పోల్చితే 9 రెట్లు ఎక్కువ.
మ్యూజిక్, ప్రాంతీయ వార్తలు, కామెడీ షోలను చూసేవారూ పెరుగుతున్నారు. ఈ కేటగిరీలు చూసేవారి సంఖ్య 30-40 శాతం పెరిగింది. మొత్తానికి 80 శాతం డేటాను వీడియోల కోసమే వెచ్చిస్తున్నారు.
ఇక టీవీలతో పోల్చితే మొబైల్‌పైనే గడిపేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు వారానికి 28 గంటలకు పైగా మొబైల్ చూస్తున్నారు. ఇది టీవీకన్నా ఏడు రెట్లు ఎక్కువ.
అయితే ఆ నివేదికను బీబీసీ న్యూస్ తెలుగు స్వతంత్రంగా పరిశీలించడానికి సాధ్యపడలేదు. నివేదిక కోసం విడూలీని సంప్రదించగా కొన్ని కారణాల వల్ల ఆ నివేదికను ఇప్పుడు ఇవ్వలేమని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
తెలుసా!
పోర్న్ వీక్షకులు ఎక్కువగా ఉన్న దేశాల్లో (కెనడా, అమెరికా, బ్రిటన్, భారత్) ఎక్కువ మంది పోర్న్ చూస్తున్న మహిళలు భారత్‌లోనే ఉన్నారని పోర్న్ హబ్ వెల్లడించింది. భారత్‌లో పోర్న్ చూసేవారిలో 30 శాతం మంది మహిళలే ఉన్నారని ఈ ఏడాది మొదట్లో వెల్లడించింది.
పోర్న్ చూస్తున్న వారిలో మహిళల ప్రపంచ సగటు 26 శాతంగా ఉండగా భారత్‌లో మరో 4 శాతం ఎక్కువ మందే ఉన్నారు.
పోర్న్ హబ్ ఇటీవల వెల్లడించిన వివరాల మేరకు.. పోర్న్ వీక్షణలో భారత్‌ది నాలుగో స్థానం. మొదటి మూడు స్థానాల్లో అమెరికా, బ్రిటన్, కెనడా ఉన్నాయి.
పోర్న్ చూసేవారిలో ఎక్కువ మంది 18-24 ఏళ్ల మధ్యవారే. వీరి వాటా 48 శాతం.

ఫొటో సోర్స్, Getty Images
కారణాలు
దేశంలో ఉచిత ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం చాలా సంస్థలు తక్కువ ధరకే 4జీ ఇస్తుండటం నెట్ వినియోగం పెరిగేందుకు కారణమవుతోంది. తక్కువ ధరలకు స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడం కూడా నెట్ వ్యాప్తికి సాయం చేస్తున్నాయి.
'నేటి'జన్లు!
దేశంలో 2011లో రోజూ 1-1.5 కోట్ల మంది నెట్ చూస్తుండగా ఈ సంఖ్య 2017కి 30.కోట్లకు చేరింది. ఇక 2050కి ఈ సంఖ్య 65 కోట్లుకు చేరుతుందని అంచనా. కానీ ప్రస్తుత తీరే కొనసాగితే 2050కి నెటిజన్ల సంఖ్య మరింత పెరిగే వీలుంది. (ఆధారం:గూగుల్)
ఇవి కూడా చూడండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విట్టర్లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.)








