టీ20 వరల్డ్ కప్: సెమీ పైనల్స్‌కు చేరిన భారత్, పాకిస్తాన్... బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో పాక్ విజయం

భారత్ ఓటమిపై పాకిస్తాన్‌లో ఆగ్రహావేశాలు.. విరాట్ కోహ్లీకి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాలంటూ డిమాండ్లు

ఫొటో సోర్స్, Daniel Pockett-ICC

ఆదివారం జరిగిన రెండో గ్రూప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచిన పాకిస్తాన్ గ్రూప్-2 నుంచి సెమీస్‌ చేరిన రెండో జట్టుగా నిలిచింది. నెదర్లాండ్స్ దక్షిణాఫ్రికాను ఓడించడంతో భారత్ ఇప్పటికే సెమీస్ చేరుకుంది.

పాకిస్తాన్‌తో సెమీస్‌కు కీలకమైన మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 127 పరుగులే చేసింది. పాకిస్తాన్ ఇంకా 11 బంతులు ఉండగానే విజయలక్ష్యం అందుకుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

పాకిస్తాన్ 18.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. ఓపెనర్లు మహమ్మద్ రిజ్వాన్ 32, బాబర్ ఆజం 25, మహమ్మద్ హారిస్ 31 పరుగులు చేయగా, 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన షాన్ మసూద్ జట్టుకు విజయం అందించాడు.

బంగ్లా బౌలర్లలో నసూమ్ అహ్మద్, షాకిబ్ అల్ హసన్, ముస్తఫిజుర్ రహ్మాన్, ఇపాదత్ హుస్సేన్ తలా ఒక వికెట్ తీశారు.

బంగ్లా ఆటగాళ్లలో ఓపెనర్ నిజాముల్ హొస్సేన్ షాంటో హాఫ్ సెంచరీ(54) చేయగా, సౌమ్యా సర్కార్ 20, అఫీఫ్ హుస్సేన్ 24 పరుగులు చేశారు. లిట్టన్ దాస్ 10 పరుగులకే అవుటవగా, మిగతా అందరూ సింగిల్ స్కోరుకే పరిమితమయ్యారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 4 వికెట్లు పడగొట్టగా, షాదాబ్ ఖాన్ 2, హారిస్ రౌఫ్, ఇఫ్తికార్ అహ్మద్ చెరో వికెట్ తీశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

సెమీస్ సమీకరణాలు మార్చేసిన నెదర్లాండ్స్

సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు నెదర్లాండ్స్ షాక్ ఇచ్చింది. 13 పరుగుల తేడాతో విజయం సాధించి ఆ జట్టును టోర్నీకి దూరం చేసింది. ఆ తరువాత జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచి పాకిస్తాన్ కూడా సెమీస్‌లోకి అడుగు పెట్టింది.

ఆదివారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అనూహ్యంగా నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది. దాంతో, భారత్ సెమీస్ బెర్త్ ఖరారైంది.

నెదర్లాండ్స్ క్రికెట్ టీమ్

ఫొటో సోర్స్, ANI

దక్షిణాఫ్రికా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. నెదర్లాండ్స్ బ్యాట్స్‌మన్ దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొని 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేశారు. కొలిన్ ఆకర్‌మన్ 41 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, ఓపెనర్ స్టీఫెన్ మైబర్గ్ 37, టామ్ కూపర్ 35, మాక్స్ ఓడౌడ్ 29 పరుగులు చేశారు.

159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులో రిలీ రోసో చేసిన 25 పరుగులే అత్యధిక స్కోరు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టిన నెదర్లాండ్స్ బౌలర్లు దక్షిణాఫ్రికా సెమీస్ ఆశలపై నీళ్లు చల్లారు. బ్రండన్ గ్లోవర్‌ 3 వికెట్లు పడగొట్టగా, బాస్ డీ లీడే, ఫ్రెడ్ క్లాసెన్ చెరి 2 వికెట్లు, పాల్ వాన్ మీకెరెన్ ఒక వికెట్ తీశారు.

సెమీ పైనల్స్‌లో ఎవరి మధ్య పోటీ?

ఈరోజు భారత జట్టుకూడా జింబాబ్వేతో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా భారత్ సెమీస్‌కు చేరుకుంది. అయితే, భారత జట్టు సెమీస్‌లో ఏ జట్టుతో తలపడే అవకాశం ఉందన్నది ఈ మ్యాచ్ నిర్ణయిస్తుంది. గ్రూప్-1లో న్యూజీలాండ్ మొదటి స్థానంలో ఉండగా, ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచింది.

జింబాబ్వేపై భారత్ విజయం సాధిస్తే భారత్ 8 పాయింట్లతో మొదటి స్థానానికి వస్తుంది. అప్పుడు భారత్ సెమీ పైనల్లో ఇంగ్లండ్‌తో ఆడాల్సి ఉంటుంది.

అదే సమయంలో, గ్రూప్-2లో సెమీస్‌కు చేరుకునే రెండో జట్టు ఏదన్నది ఆదివారం పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య జరగబోయే మ్యాచ్‌తో తేలిపోతుంది. ఈరెండు జట్లూ చెరో నాలుగు మ్యాచ్‌లు ఆడాయి. సమానంగా పాయింట్స్ సొంతం చేసుకున్నాయి. అయితే, నెట్ రన్ రేట్ విషయంలో బంగ్లాదేశ్ కన్నా పాకిస్తాన్ ముందంజలో ఉంది. పాకిస్తాన్‌ కనుక గ్రూప్‌లో రెండో స్థానంలో ఉంటే న్యూజీలాండ్‌తో సెమీస్ ఆడుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)