పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్‌పై ‘హత్యాయత్నం’.. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారంటే

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Reuters

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ మీద కాల్పులు జరిగాయి.

ఈ ఘటనలో ఆయన కాలికి బుల్లెట్ తగిలినట్లు పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) జనరల్ సెక్రటరీ అసద్ ఉమర్ తెలిపారు.

పాకిస్తాన్‌లోని గుజ్రాన్‌వాలా వద్ద గల అల్లాహ్‌వాలా చౌక్ సమీపంలో ఈ ఘటన జరిగింది.

ఎంపీ ఫైజల్ జావేద్ కూడా గాయపడినట్లు బీబీసీ ఉర్దూ తెలిపింది. మొత్తం మీద ఈ ఘటనలో నలుగురు గాయపడినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఒక వ్యక్తిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కాల్పులు జరిపింది ఆ వ్యక్తేనా కాదా అనేది ఇంకా నిర్ధరించలేదు.

ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్‌ను లాహోర్‌కు తరలించినట్లు పీటీఐ జనరల్ సెక్రటరీ వెల్లడించారు.

ఇమ్రాన్ ఖాన్ ర్యాలీ

ఇమ్రాన్ ఖాన్ నిరసన ర్యాలీ

పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్టోబరు 28న ఇమ్రాన్ ఖాన్ ర్యాలీ ప్రారంభించారు. ఆరు రోజులుగా 'ఫ్రీడం మార్చ్' జరుగుతోంది.

ప్రణాళిక ప్రకారం రేపటికి ఆయన ర్యాలీ పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ చేరుకోవాల్సి ఉంది. కానీ షెడ్యూల్‌లో ఆలస్యం అవుతుందని పీటీఐ జనరల్ సెక్రటరీ తెలిపారు.

ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

నేటితో ఇమ్రాన్ ఖాన్ ర్యాలీ 7వ రోజుకు చేరుకుంది. ‘మా కార్యకర్తల్లో కొందరు గాయపడ్డారు. ఒకరు వీర మరణం పొందినట్లుగా వార్తలు వస్తున్నాయి. అందరి కోసం ప్రార్థిద్దాం’ అని ఎంపీ ఫైజల్ జావేద్ ఒక వీడియోలో అన్నారు.

ఆ వీడియోను పీటీఐ పార్టీ ట్వీట్ చేసింది.

షాబాజ్ షరీఫ్

ఫొటో సోర్స్, Getty Images

ఖండించిన పాకిస్తాన్ ప్రధాని

ఇమ్రాన్ ఖాన్ మీద దాడిని పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఖండించారు.

తక్షణమే ఘటన మీద నివేదిక ఇవ్వాల్సిందిగా హోం మంత్రి, పంజాబ్ చీఫ్ సెక్రటరీ, ఐజీలను ఆయన కోరారు.

చైనా పర్యటన తరువాత నిర్వహించాల్సిన మీడియా సమావేశాన్ని కూడా ఆయన వాయిదా వేసుకున్నారు.

రెండు రోజుల పర్యటన తరువాత చైనా నుంచి నేడు పాకిస్తాన్‌కు చేరుకున్నారు షాబాజ్ షరీఫ్.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)