మహిళల వక్షోజాల నగ్న ఫొటోలతో అడిడాస్ స్పోర్ట్స్ బ్రా ప్రకటనలపై నిషేధం

ఫొటో సోర్స్, ADIDAS
- రచయిత, జెన్నిఫర్ మీయిరాన్స్
- హోదా, బీబీసీ న్యూస్
మహిళల వక్షోజాలను నగ్నంగా చూపించే ఫొటోలతో అడిడాస్ కంపెనీ తమ కొత్త స్పోర్ట్స్ బ్రా వాణిజ్య ప్రకటనలను విడుదల చేసింది. అయితే, నగ్నత్వం నిబంధన కింద బ్రిటన్‌లో ఈ వ్యాపార ప్రకటనలను నిషేధించారు.
అడిడాస్ కంపెనీ చేసిన ఒక గ్రిడ్ ఫార్మాట్ ట్వీట్‌లో, రెండు పోస్టర్లలో.. వివిధ రకాల చర్మ రంగులు, ఆకారాలు, పరిమాణాలలోని పదుల సంఖ్యలో మహిళల నగ్న వక్షోజాల ఫొటోలు కనిపించాయి.
ఈ మూడు వెర్షన్లూ విస్తృతంగా ఆగ్రహం కలిగించవచ్చునని బ్రిటన్ వాణిజ్య ప్రకటనల పర్యవేక్షణ సంస్థ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ గుర్తించింది.
అయితే ఈ అడ్వర్టైజ్‌మెంట్లు ''వక్షోజాలలో ఎంత భిన్నత్వం ఉందో, కాబట్టి సరైన స్పోర్ట్స్ బ్రా ఎంత ముఖ్యమో'' అనేది మాత్రమే చూపుతున్నాయని అడిడాస్ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ అడ్వర్టైజ్‌మెంట్ సందేశానికి తాము గర్వంగా కట్టుబడి ఉన్నామని అడిడాస్ యూకే అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈ అడ్వర్టైజ్‌మెంట్‌ను సంస్థ తన వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తూనే ఉంది.
ఆ ట్వీట్‌ను ఫిబ్రవరి నెలలో పోస్ట్ చేశారు. ''అన్ని ఆకారాలు, పరిమాణాలలోని మహిళల వక్షోజాలకు మద్దతు, సౌకర్యం అవసరమని మేం విశ్వసిస్తాం. అందుకే ప్రతి ఒక్కరూ తమకు సరైన్ ఫిట్‌ను పొందగలిగేలా మా కొత్త స్పోర్ట్స్ బ్రా శ్రేణిలో 43 స్టైల్స్ ఉన్నాయి'' అని ఆ ట్వీట్‌లో రాసింది.
ఆ రెండు పోస్టర్లు 62 మంది మహిళలు, 64 మంది మహిళల క్రాప్డ్ ఫొటోలను చూపుతున్నాయి. ''మేం కేవలం ఒకటే కొత్త స్పోర్ట్స్ బ్రా తయారు చేయకపోవటానికి కారణాలు'' అని ఆ పోస్టర్లతో పాటు పేర్కొంది.

ఫొటో సోర్స్, PA Media
ఈ యాడ్‌ల మీద బ్రిటన్ వాణిజ్య ప్రకటనల పర్యవేక్షణ సంస్థ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ ఏజెన్సీకి 24 ఫిర్యాదులు అందాయి. ఇందులో అనవసరంగా నగ్నత్వాన్ని వినియోగించారని, మహిళలను వస్తువు స్థాయికి దిగజార్చారని, వారిని లైంగికీకరించారని, కేవలం శరీర భాగాలకు పరిమితం చేశారని ఆ ఫిర్యాదుల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఈ పోస్టర్లను పిల్లలు చూసే అవకాశమున్న చోట ప్రదర్శించటం సరైనదేనా అని ప్రశ్నిస్తూ కొందరు ఏఎస్ఏను సంప్రదించారు.
ఇదిలావుంటే.. ఈ పోస్టును కొందరు యూజర్లు రిపోర్ట్ చేశారని, అయితే ట్విటర్ నిబంధనలను అది ఉల్లంఘిస్తున్నట్లు తమకు కనిపించ లేదని ట్విటర్ చెప్పింది.
ఈ ట్వీట్‌లో మహిళలను చూపిన తీరు లైంగికంగా అశ్లీలంగా ఉన్నట్లుగా కానీ, మహిళలను వస్తువులుగా చిత్రీకరించినట్లుగా కానీ తాను భావించటం లేదని ఏఎస్ఏ పేర్కొంది.

ఫొటో సోర్స్, Adidas
అయితే ఈ ట్వీట్‌ను అశ్లీల నగ్నత్వంగా చూసే అవకాశం ఉందని తాను భావిస్తున్నానని.. కాబట్టి మానసిక గాయం కలిగించకుండా ఉండటానికి ఈ యాడ్‌ను జాగ్రత్తగా టార్గెటెడ్‌గా ప్రదర్శించాల్సి ఉంటుందని పేర్కొంది. పిల్లలు కూడా చూడగలిగే అన్‌టార్గెటెడ్ మీడియాలో వాడటానికి ఈ పోస్టర్లు తగవని నిర్ధారించింది.
''విభిన్న ఆకారాలు, పరిమాణాలను ప్రతిబింబించటం, భిన్నత్వాన్ని విశదీకరించటం, ప్రత్యేకంగా తయారుచేసిన సపోర్ట్ బ్రాలు ఎందుకు ముఖ్యమో చూపించటం'' ఆ ఫొటోల ఉద్దేశమని అడిడాస్ యూకే చెప్పింది.
ఈ ఫొటోల్లోని మహిళల (మోడళ్ల) గుర్తింపును దాచటానికి, వారి భద్రతను కాపాడటానికి ఈ ఫొటోలను క్రాప్ చేసినట్లు తెలిపింది. ఈ ఫొటోల్లో కనిపించిన మోడళ్లందరూ ఈ యాడ్‌లో ఉండటానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని, తమ లక్ష్యానికి మద్దతు తెలిపారని పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: పెళ్లయిన నెల రోజులకే భర్త పీక పిసికి, పైట బిగించి హత్య చేసిన భార్య... ఏం జరిగిందంటే
- మదర్స్ డే: తల్లి అయ్యేందుకు సరైన వయసు ఏది? నిపుణులు చెప్పిన సమాధానం ఇది
- టంగ్-టై అంటే ఏంటి? పిల్లల్లో పెరుగుతున్న ఈ కొత్త సమస్యను గుర్తించడం ఎలా?
- బిట్ కాయిన్ ధర ఆరు నెలల్లో ఎందుకు సగానికి పడిపోయింది... క్రిప్టోవింటర్ అంటే ఏంటి?
- యుక్రెయిన్ యుద్ధం: వ్లాదిమిర్ పుతిన్‌కు మద్దతు తెలిపేందుకు నకిలీ అకౌంట్లు ఉపయోగిస్తున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









