తలలో అట్టకట్టుకుపోయిన చుండ్రు పెచ్చులు, పెచ్చులుగా ఊడుతోందా.. దీన్ని వదిలించుకోవడం ఎలా?

వీడియో క్యాప్షన్, తలలో అట్టకట్టుకుపోయిన చుండ్రు.. వదిలించుకోవడం ఎలా?

డాండ్రఫ్ లేదా చుండ్రు. ఇది చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఈ చుండ్రు సమస్య పోయినట్లే పోయి మళ్లీ మళ్లీ వస్తుంటుంది.

డాండ్రఫ్ ముఖ్యంగా ఒక ఫంగస్ వల్ల వస్తుందనేది తెలిస్తే మీకు ఆశ్చర్యం కలగచ్చు.

చుండ్రు దాదాపు మనందరి చర్మంపై సహజంగానే ఉంటుంది. కానీ, మనలో దాదాపు సగం మందికి ఇదొక సమస్యగా మారుతుంది.

వారిలో కూడా మూడింట ఒక వంతులో ఈ సమస్య ఏ స్థాయికి చేరుతుందంటే, చుండ్రు వల్ల వారికి బయటకు వెళ్లాలంటేనే కష్టమైపోతుంది.

చెప్పాలంటే డాండ్రఫ్ సమస్య అనేది చాలా మామూలు సమస్య. కానీ, పది మందిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇది మనల్ని సిగ్గుపడాల్సిన పరిస్థితిలో పడేస్తుంది.

చుండ్రును వదిలించుకోవాలంటే ఈ ఐదు పనులూ చేసి చూడండి.. అవేంటో పైన వీడియోలో చూడండి..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)