ఇంగ్లిష్ చానల్‌లో అక్రమ వలసదారుల పడవ మునక, 27 మంది మృతి

ఫొటో సోర్స్, Getty Images
ఇంగ్లిష్ చానల్‌లో పడవ మునిగి 27 మంది చనిపోయారు. బ్రిటన్‌కు చేరుకునేందుకు అక్రమ మార్గంలో బయలుదేరిన ఈ పడవ ఫ్రాన్స్ లోని కాలే నగరం వద్ద నీట మునిగింది.
ఈ జల సంధిలో జరుగుతున్న ప్రమాదాల సమాచారాన్ని 2014 నుంచి పరిశీలిస్తున్న 'ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్' సంస్థ అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో ఇదే అత్యంత దారుణమైనదని తెలిపింది.
ఈ దుర్ఘటన తనకు ఎంతో బాధ కలిగించిందని చెప్పిన బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్, మనుషుల అక్రమ రవాణాను నిరోధించడానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఫొటో సోర్స్, AFP
ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో అయిదుగురు మహిళలు, ఒక బాలిక ఉన్నారు. 'ఇద్దరు వ్యక్తులను కాపాడాం. ఒకరు కనిపించకుండా పోయారు' అని ఫ్రాన్స్ హోం మంత్రి గెరాల్డ్ డర్మానిన్ చెప్పారు.
ఈ ప్రమాదంలో 31 మంది చనిపోయారని ప్రకటించినప్పటికీ, ఆ సంఖ్యను 27గా సవరించారు.
బెల్జియం సరిహద్దు వద్ద నలుగురిని అరెస్ట్ చేశామని చెప్పిన గెరాల్డ్, "ఈ అక్రమ రవాణాకు వారికి ప్రత్యక్ష సంబంధం ఉందని భావిస్తున్నాం" అని అన్నారు.
సామాన్య ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్న అక్రమ రవాణా ముఠాలను అడ్డుకునేందుకు ఉమ్మడిగా తగిన చర్యలు తీసుకోవాలని బుధవారం సాయంత్రం బ్రిటన్ ప్రధాని జాన్సన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మేక్రాన్ ఒక అంగీకారానికి వచ్చారని ఫ్రెంచి పత్రిక డౌనింగ్ స్ట్రీట్ తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
"ఇంగ్లిష్ చానల్‌ను శ్మశానంగా మారనిచ్చేది లేదు" అని చెప్పిన మేక్రాన్, ఈ ఘటనకు బాధ్యులైన వారిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామన్నారు. ఇప్పటివరకు ఉత్తర ఫ్రాన్స్‌లో 1,552 స్మగ్లర్లను అరెస్టు చేశామని, 44 అక్రమ నెట్ వర్క్ సంస్థలను చెదరగొట్టామని ఆయన చెప్పారు.
అయినప్పటికీ, ఈ ఏడాది బ్రిటన్‌కు అక్రమంగా వలస వెళ్లడానికి 47,000 మంది ఇంగ్లిష్ చానల్ దాటే ప్రయత్నం చేశారని, 7,800 మంది వలసదారులను ఆదుకున్నామని మేక్రాన్ వివరించారు.
ఇవి కూడా చదవండి:
- రాయలసీమలో 50 ఏళ్లలో ఎన్నడూ చూడని విపత్తు, నష్టం అంచనా రూ.6వేల కోట్లకు పైనే, అసలేం జరిగింది?
- బిట్‌కాయిన్‌ను కేంద్రం నిషేధిస్తుందా.. క్రిప్టోకరెన్సీపై మోదీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది?
- అభినందన్ వర్థమాన్‌కు వీర్ చక్ర అవార్డు ఇవ్వడంపై పాకిస్తాన్ ఏమందంటే..
- సోషల్ మీడియాలో సిక్కుల పేర్లతో సిక్కులపైనే దుష్ప్రచారం... నకిలీ నెట్వర్క్ గుట్టు రట్టు
- పూంచ్ ఎన్కౌంటర్: తొమ్మిది మంది భారత సైనికులు చనిపోయిన ఈ ఆపరేషన్‌లో సమాధానాలు లేని ప్రశ్నలెన్నో...
- బిట్‌కాయిన్‌లో మదుపు చేయాలా? బంగారంలో పెట్టుబడులు పెట్టాలా
- టైప్ రైటర్ అంటే భారతీయులకు ఇప్పటికీ ఎందుకంత మోజు?
- భారత్‌లో తొలి బిట్ కాయిన్ స్కామ్: 25 ఏళ్ల హ్యాకర్ చుట్టూ తిరుగుతున్న కర్ణాటక రాజకీయాలు
- హైపర్సోనిక్ క్షిపణి ఏంటి? ఇవి నిజంగా అంత ప్రమాదకరమైనవా?
- ఈ చిన్న అట్టపెట్టె లాంటి ఉపగ్రహాలు ప్రపంచాన్ని ఎలా మార్చేయబోతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








