ఒకేసారి ఆరుగురితో డేటింగ్ చేస్తున్న బాయ్‌ఫ్రెండ్.. గర్ల్‌ఫ్రెండ్ ఎలా కనిపెట్టిందంటే.. ఆ తర్వాత ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్..

వీడియో క్యాప్షన్, ఒకేసారి ఆరుగురితో డేటింగ్ చేస్తున్న బాయ్‌ఫ్రెండ్.. గర్ల్‌ఫ్రెండ్ ఎలా కనిపెట్టిందంటే..

ఇది మామూలు కథ కాదు. ఒక యువకుడు ఒకేసారి ఆరుగురు అమ్మాయిలతో డేటింగ్ చేస్తున్నాడు. ఒక గర్ల్‌ఫ్రెండ్‌కి అనుమానం వచ్చింది.

తన బాయ్‌ఫ్రెండ్ మోసాన్ని కనిపెట్టాలని నిర్ణయించుకుంది.

తొలుత సోషల్ మీడియాలో ఏమైనా క్లూస్ దొరుకుతాయేమోనని వెతికింది.

అలా వెతుకుతుంటే ఒకమ్మాయితో పరిచయం ఏర్పడింది.

వాళ్లిద్దరూ మరొకరిని పట్టుకున్నారు. ఇలా మొత్తం ఆరుగురు అమ్మాయిలు బయటపడ్డారు.

వీళ్లంతా ఒకేసారి, ఒకే బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకుని వాళ్లే అవాక్కయ్యారు.

తమ బాయ్‌ఫ్రెండ్ తమను మోసం చేస్తున్నాడని, అతడికి గుణపాఠం చెప్పాలని భావించుకున్నారు.

అతడిని ఎదుర్కొన్నారు. అతనితో సంబంధాలు తెంచుకున్నారు.

కథ ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడే అసలు కథ ప్రారంభమైంది.

తాము ప్రయాణం చేస్తున్న బస్సుపై బెకా, అబీ, మోర్గాన్
ఫొటో క్యాప్షన్, తాము ప్రయాణం చేస్తున్న బస్సుపై బెకా, అబీ, మోర్గాన్

ఆరుగురు అమ్మాయిలూ ఫ్రెండ్స్ అయిపోయారు.

ఆ తర్వాత మాజీ బాయ్‌ఫ్రెండ్ మళ్లీ వీళ్ల జీవితాల్లోకి వచ్చాడు.

అందరితో కలసి సరదాగా ట్రావెల్ చేయాలన్నదే తన కల అని చెప్పాడు.

దీంతో ఈ అమ్మాయిలంతా తలోకొంత డబ్బును ఆదా చేసుకుని, ఒక పాత స్కూల్ బస్సును కొన్నారు.

దానిని వాళ్లే బాగు చేసుకున్నారు.

అంతా కలసి ప్రయాణం మొదలు పెట్టారు.

ఆ తర్వాత ఏం జరిగిందో వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)